All meadia

 

Sunday, 1 February 2015

ఆలస్యంగా వచ్చినందుకు మోకాళ్ల దండన

తెలంగాణ వెబ్ న్యూస్;సంక్రాంతి సెలవులకు ఇంటి కెళ్లి ఆలస్యంగా వచ్చినందుకు విద్యార్థులకు మోకాళ్ల దండన విధించాడో ఓ తెలుగు మాస్టారు ఈ సంఘటన విబయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని పామిటి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వచ్చినందుకు రూ.160ల జరిమానా  చెల్లించండి.లేదంటే గ్రౌండు చుట్టూ మోకాళ్లపై ఆరు రౌండ్లు నడవాలని ఎం.రవి అనే తెలుగు మాస్టర్  విద్యార్థులకు శిక్ష విధించాడు. 
డబ్బులు ఉన్న వారు పైన్ కట్టారు.లేని వారు మోకాళ్లపై నడిచారు. మోకాళ్ల పై జనవరి 26 నుంచి రెండు రోజుల పాటు గ్రౌండ్ చుట్టూ నడవడంతో అశ్విని అనే గిరిజన బాలిక  ఆదివారం అస్వస్థతకు గురైంది. దీంతో బాలికను సార్వతీపురం ఆసుపత్రిలో చేర్చారు. ఈ నిర్వాహకంపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

No comments:

Post a Comment