All meadia

 

Monday, 6 October 2014

రూ.2599కే సెల్‌కాన్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్


తెలంగాణ వెబ్ న్యూస్ హైదరాబాద్; 
ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సెల్‌కాన్ మరో చవక ధర ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. సెల్‌కాన్ ‘ఏ354సీ' మోడల్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.2599. రెడ్, బ్లాక్, వైట్ ఇంకా బ్లూ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంచారు. సెల్‌కాన్ ‘ఏ354సీ' స్మార్ట్‌ఫోన్‌‍ను ప్రముఖ రిటైలర్ HomeShop18 ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ధర రూ.2,599. సెల్‌కాన్ ‘ఏ354సీ' స్పెసిఫికేషన్‌లు: 3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 256 ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, వై-ఫై, బ్లూటూత్, ఏ2డీపీ), డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 

No comments:

Post a Comment