తెలంగాణ వెబ్ న్యూస్;ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి బ్యాంక్ ఖాతా స్తంభవ,మరో బ్యాంక్ లో లావాదేవీ ల కొనసాగింపుపై యథాతథస్థితి కొనసాగిస్తూ మధ్యంతర ఉత్తర్వుల జారీకి ఉమ్మడి హైకోర్టు నిరికరించింది.కనీసం బ్యాంక్ ఖాతాల్లో ఏపీ ఉన్నత విద్యామండలి చేస్తున్న నిధుల వినియోగం తుది తీర్పునకు లోబడి ఉండేలా ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ చేసిన అభ్యర్థననూ తోసిపుచ్చింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్,శాంతి నగకర్ శాఖ తమ ఖాతాను స్తంభింప చేయడాన్ని సవాలు చేస్తూ ఏపీ ఉన్నత విద్యామండలి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment