తెలంగాణ వెబ్ న్యూస్;గ్రేటర్ టీడీపీ ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ మొదలైంది.ఇప్పటి వరకు మంత్రులు మాత్రమే పాల్గొనగా ఇప్పుడు నేరుగా సీఎం కేసీఆరే రంగంలోకి దిగారు.టీడీపీ ఎమ్మెల్యేలకు వరుసపెట్టి ఫోన్ చేస్తున్నారు.ముఖ్యమంత్రే నేరుగా రంగంలోకి దిగడంతో టీ.టీడీపీ ఎమ్మెల్యేలు విలవిల్లాడుతున్నారు.
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల ఫోన్లు మారుమోగుతున్నాయి. ఒకసారి ఫోన్ తీయకపోతే ..తీసే వరకు అవి మోగుతునే ఉన్నాయి. ఫోన్ తీయగానే బ్రదర్ ఒకసారి వచ్చి వెళ్లండి. మీతో మాట్లాడాలి నేరుగా సీఎం కేసీఆర్ ఫోన్ లైన్ లోకి వస్తున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలుతీవ్ర వత్తిడికి లోనవుతున్నారు. గతంలో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఇలాంటి ప్రయత్నమే చేశారు.కొద్ది మంది ఎమ్మెల్యేల ఇళ్లకు వారు నేరుగా వెల్లారు మఖ్యమంత్రి తరపున వచ్చామని...టీఆర్ ఎస్ పార్టీలోకి రావాలని కోరారు. టీడీపీకీ భవిష్యత్ లేదని సర్ది చెప్పారు. అయినా ఎమ్మెల్యేలు ఆ వత్తిడికి లొంగలేదు.హరీష్,కేటీర్ ల ఆహ్వానాన్నివారు సున్నితంగానే తిరస్కరించారు.
No comments:
Post a Comment