తెలంగాణ వెబ్ న్యూస్;ఆడపిల్లల చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమానికి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరైన గత విద్యా సంవత్సరంలో సాధించిన విద్యార్థులకు మెడల్స్ లో పాటు ప్రశంసాపత్రాలు,మెమోంటోలను అందజేశారు. అనంతరం విద్యర్థినులను ఉద్దేశించి పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు,కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులు నూటికి నూరుశాతం పేద కుటుంబాల నుంచి వచ్చిన వారేనని,ఇలాంటి వారు విద్యనభ్యసించి అభివృద్ది వైపు ఆలోచిస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాను పాలకులు పూర్తిగా విస్మరించారని అందుకు నిదర్శనం ఇక్కడి ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలనేనని అన్నారు. పేర్లు మాత్రం వాళ్లవి పెట్టుకుని వారిని చిరస్మరణీయంగా ఇక్కడి ప్రజలు గుర్తించుకునేలా ఉండేలా చూశారా తప్పా ఇక్కడి పేదరికాన్ని పారద్రోలడానికి కృషి చేయలేదని అన్నారు.
No comments:
Post a Comment