తెలంగాణ వెబ్ న్యూస్;కరువుతో ఇబ్బందులు పడుతున్న రాయలసీమ,ప్రకాశం జిల్లాలకు తాగునీరు,సాగు నీరు అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీఇచ్చారు.పట్టిసీమ వద్ద ఈ నెల 23న ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లిస్తామని,తద్వారా మిగిలే శ్రీశైలం నీటిని రాయలసీమ,ప్రకాశం జిల్లాలకు ఇస్తామని ఆయన చెప్పారు.చిత్తూరు జిల్లా బి.కొత్తపేట మండలం గుమ్మసముద్రం గ్రామం పెద్ద చెరువులగురువారం సీఎం నీరు-చెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ నిర్మించిన నీరు-చెట్టు ఫైలాన్ ను ప్రారంభించి చెరువులో పూడికతీత మట్టిని జే సీబీతో ట్రాక్టర్ లో పోశారు.
No comments:
Post a Comment