తెలంగాణ వెబ్ న్యూస్;ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనతో ఉనికి కోల్పోతామనే భయంతో చంద్రబాబునాయుడు తెలంగాణలో పర్యటిస్తుంటే ,ఆయన ఇచ్చే డబ్బులు మిగుల్చుకోవడానికే టీటీడీపీ నేతలు సహకరిస్తున్నారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శనాసాత్రలు సంధించారు. శుక్రవారం టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, సమావేశం నిర్వహించి చంద్రబాబు పర్యటనను విమర్శించారు.సభ నిర్వహణకు చంద్రబాబునాయుడు ఇచ్చేడబ్బులను మిగుల్చుకోవడానికే టీ-టీడీపీ నేతలు బాబు జపం చేస్తున్నారని వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ఎద్దేవా చేశారు.మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేగువ్వల బాలరాజు మాట్లాడుతూ టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకే టీడీపీ నేత తెలంగాణలో పర్యటించారని విమర్శించారు. దళితుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబునాయుడికి,టీడీపీకి లేదన్నారు.దమ్ముంటే మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించాలని సవాల్ విసిరారు.తెలంగాణకు నీళ్లు రాకుండా కృష్ణా ట్రిబ్యునల్ ను లోబర్చుకునే ప్రయత్నాలు,కేంద్రానికి ప్రతిరోజు ఫిర్యాదులు చంద్రబాబు కుట్రలకు నిదర్శనమని పేర్కొన్నారు.
No comments:
Post a Comment