తెలంగాణ వెబ్ న్యూస్;బాల్య వివాహాన్ని అడ్డకోబోయిన ఓ అధికారిపై దాడి జరిగింది ఆదివారం పలుచోట్ల బాల్య వివాహాలు జరుగుతున్నాయన్న సమాచారం అందుకొని హైదరాబాద్ జిల్లా బాలల సంరక్షణ అధికారి(డీసీపీవో) మహ్మద్ ఇంతియాజ్ తోపాటు,మలక్ పేట సెక్టార్ బాలల అభివృద్ధిసంరక్షణ అదికారిణి (సీడీపీవో) ప్రజ్వల సింగరేణికాలనీకి వెల్లారు.బిక్కునాయక్ అనే వ్యక్తి తన పదహారేళ్ల కుమార్తె వివాహాన్ని జరిపేందుకు సన్నాహాలు చేస్తుండగా అడ్డుకొని కుటుంబసభ్యులకు అవగాహన కల్పించారు.అనంతరం మంగల్ హాట్, బండ్లగూడ మండలంలో బాల్యవివాహాలను అడ్డుకున్నారు. అనంతరం బాలిక తల్లిదండ్రుల నుంచి సంబంధిత పత్రాలపై సంతకాలు తీసుకునేందుకు డీసీపీవో ఇంతియాజ్ ఒంటరిగా సింగరేణి కాలనీకి వచ్చారు.తాను ఆపిన వివాహాన్ని మళ్లీ చేయబోతున్న దృశ్యాలను మొబైల్ లో చిత్రీకరించారు. ఈ సమయంలో బాలిక తల్లిదండ్రులు.బంధువులు అధికారి మొబైల్ లాక్కొని ఆయన్ను చితకబాదారు. ప్రాణభయంతో ద్విచక్రవాహనాన్ని అక్కడే వదిలేసిన అధికారి తప్పించుకుని సైదాబాద్ ఠాణాకు చేరుకొని ఫిర్యాదు చేశారు.
No comments:
Post a Comment