తెలంగాణ వెబ్ న్యూస్;తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారిగా జరుగుతున్న ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి జిల్లా జాయంట్ కలెక్టర్ రజత్ కుమార్ సైనీ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఇంటర్ పరీక్షల నిర్వహణకు వివిధ శాఖల అధికారులతో తన చాంబర్ లో సమీక్షించారు.మార్చి 9 నుండి 27 వరకు జరిగే ఈ పరీక్షల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందుల
రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లాలోని 229 పరీక్షా కేంద్రాల్లో లక్షా ఆరువేల 621 మంది విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరుకానున్నారని ఆయన తెలిపారు.ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 92 వేల 654 మంది విద్యార్థులు హాజరు కానున్నారని దీనికి సంబంధించిన ప్రశ్నాపత్రాల భద్రతకు 47 పోలీసు స్టేషన్ లను గుర్తించినట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాల భద్రతకు కట్టదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు.
No comments:
Post a Comment