తెలంగాణ వెబ్ న్యూస్;దళితులు లేని మంత్రి వర్గ దేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని తెదేపా నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ దొరలపాలన చేస్తున్నారని విమర్శించారు.మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్యను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం దళితులను అవమానించడమేనన్నారు.తెలంగాణ ప్రభుత్వం వస్తే ఇళ్లు,కరెంట్,నీళ్లు,ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం వాటిని విస్మరించారని మండిపడ్డారు.దళిత వ్యతిరేక ప్రభుత్వమైన కేసీఆర్ సర్కార్ ను కూలగొట్టే వరకు పోరాటం చేస్తామన్నారు.
No comments:
Post a Comment