All meadia

 

Monday, 30 June 2014

నేడు బల్కంపేట అమ్మవారు కల్యాణోత్సవం

లక్ష మందికి పైగా శివసత్తులు రాక...
భక్తుల భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు... 
  బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు...
తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్: బల్కంపేట అమ్మవారి కళ్యాణోత్సవాన్ని పుష్పమి నక్షంత్ర యుక్త శుభలగ్నం మంగళవారం (నేడు) ఉదయం 11 గంటలకు భారీ కళ్యాణ మండపంలో వేదపండితుల మంత్రోత్సవాల మద్య అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ కర్యనిర్వహనాధికారి కె.రఘునందన రావు తెలిపారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలంగాణా జిల్లాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి లక్ష మందికి పైగా అమ్మవారికి ప్రీతిపాత్రులైన శివసత్తులు, 5 లక్షల మందికి పైగా భక్తులు రానున్నారని ఈవో తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో అన్నారు.శివసత్తుల నృత్యాలతో బల్కంపేట పుర వీధుల గుండా కోలాటాలతో, భాజబజంత్రీల మద్య భారి ఊరేగింపును నిర్వహిస్తామన్నారు. 
విద్యుత్ కాంతుల మద్య ముస్తాబైన ఆలయం

బల్కంపేట శ్రీ ఎల్లమ్మఅమ్మవారి కల్యనోత్సవాన్ని పటిష్టంగా నిర్వహించాలి - తలసాని

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, రఘునందన్, శేషుకుమారి 
ప్రతి ఏటా జరిగే బల్కంపేట శ్రీ ఎల్లమ్మఅమ్మవారి కల్యనోత్సవాన్ని పటిష్టంగా నిర్వహించేందుకు ఎల్లమ్మ ఆలయంలో విలేకరుల సమావేశాన్ని సోమవారం  ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బంది చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందిని కోరారు. నేటి నుంచి జరిగే అమ్మవారి కల్యనోత్సవాన్ని భక్తులకు కను విందులుగా నిర్వహిస్తామని ఆలయ కర్యనిర్వాహన అధికారి రఘునందన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బల్కంపేట కార్పొరేటర్ ఎం.శేషుకుమారి, బుట్టి రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.  
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయం బయట పోలీస్ సిబ్బందితో మాట్లాడుతున్నఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ 

Sunday, 29 June 2014

ఐ డన్ ఎస్ఈవో ఆద్వర్యంలో ఘనంగా అడ్వాన్సు సోషల్ మీడియా డే


సమావేశం లో మాట్లాడుతున్న ఐ డన్ ఎస్ఈవో నిర్వాహకుడు చక్రపాణి అనుముల 
తెలంగాణ, వెబ్ న్యూస్, హైదారాబాద్; హైదరాబాద్ నగరం లో మొట్టమొదటి సరిగా ఐ డన్ ఎస్ఈవో  గ్రూప్ వారు సోషల్ మీడియా సంబరాలను ఆదివారం ఈ  తేమ్స్ డిగ్రీ కళాశాలలో  ఘనంగా నిర్వహించారు.   ఐ డన్ ఎస్ఈవో  గ్రూప్  ఫేస్  బుక్ వారు   చక్రపాణి మాట్లాడుతూ సోషల్ మీడియా డే ను మేము మొట్ట మొదటి సారిగా జరుపుకుంటున్నామన్నారు. సోషల్ మీడియా రోజును జరుపుకోవడం ఎంతో ఉత్సాహంగా ఉందన్నారు.   ఈ సందర్బంగా ప్రస్తుత స్తిథిలో  భవిషత్ ఎలా వుంటుంది అనే అంశం ఫై అనిల్ రావు, స్వాతి రెడ్డి, హరిణి ప్రభాస్, డేవిడ్ బాజంలు సోషల్ మీడియా నిపుణులు మాట్లాడారు. 
 ఐ డన్ ఎస్ఈ వో గ్రూప్ తో చక్రపాణి అనుముల 
సోషల్ మీడియా నిపుణులు  అనిల్ రావు,  స్వాతి రెడ్డి, ప్రభాస్, డేవిడ్ బాజం, సిటి శంకర్ 


 ఐ డన్ ఎస్ఈ వో గ్రూప్ సమావేశం లో పాల్గొన్న తదితరులు.. 


 

Friday, 27 June 2014

భారత మార్కెట్‌లో కొత్త యాపిల్ ఐపాడ్


 ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ యాపిల్.. భారత మార్కెట్‌లో తన నూతన ఐపాడ్‌ను ప్రవేశపెట్టింది. 16 జీబీ స్టోరేజీ సామర్థ్యం ఉన్న ఈ ఐపాడ్ ధర రూ. 16,900గా ఉంది.

ఇది పింక్, ఎల్లో, బ్లూ తదితర రంగుల్లో అందుబాటులో తెచ్చింది. ఈ ఐపాడ్‌లో 5 మెగా పిక్సెల్ ఐసైట్ కెమెరా, హెచ్ డీ వీడియో రికార్డింగ్, 4 అంగుళాల రెటీనా డిస్ ప్లే, ఏ5 చిప్, ఫేస్ టైమ్ కెమెరా సదుపాయాలు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.

32 జీబీ ఐపాడ్ ధర రూ. 20,900 కాగా, 64 జీబీ సామర్థ్యం ఉన్న ఐపాడ్ ధర రూ. 24,900. వీటిల్లో 200కు పైనే ఫీచర్లు ఉన్నాయి.


Monday, 23 June 2014

రాబోయే రోజుల్లో నూతన పారిశ్రామిక విధానం : కెసిఆర్


హైదరాబాద్ తెలంగాణ వెబ్ న్యూస్ : డార్నియర్ విమాన పరికరాల పరిశ్రమలకు రూ 500 కోట్లతో ఆదిభట్ల లో పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం శంకుస్తాపన చేశారు. మాదాపూర్ లోని హెచ్ఐసిసి  వేదికగా జరిగిన కార్యక్రమం లో  కేసీఆర్  మాట్లాడుతూ తెలంగాణలో  నూతన పారిశ్రామిక విధానాని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. పరిశ్రమల అనుమతి కోసం సింగల్ విండో విధానాని తీసుకు వచ్చామని చెప్పారు. సింగల్ విండో విభాగం సీఎంవోలోనే  ఉంటుందని స్పష్టం చేశారు. ఏరోస్పేస్ టెక్నాలజీ అభివృద్దికి హైదరాబాద్ వేదికగా మారిందని తెలిపారు. పారిశ్రామిక వేతలు కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేదని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నానని కేసీఆర్  తెలిపారు.  

అక్రమకట్టడాలపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు

Telangana-map-eng4

హైదరాబాద్: అక్రమ కట్టడాలు, గృహసముదాయాలపై తెలంగాణ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. క్రమబద్దీకరించని కాలనీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయ్యప్పసొసైటీ, గురుకుల భూములపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీంతో పోలీసులు జీహెచ్ ఎమ్ సీ అధికారులు రంగంలోకి దిగనున్నారు.

Sunday, 22 June 2014

బేగంపేట అధికారిక నివాసం మారిన ఎంపి కెసిఆర్

తెలంగాణ  వెబ్ న్యూస్, హైదరాబాద్:  తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్  కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం  ఉదయం  బేగంపేట అధికారిక నివాసం లోకి మారారు. సుదర్శనయానం, వాస్తు  పూజలతో కెసిఆర్  అధికారిక నివాసం లోకి ప్రవేశించారు. అయన ప్రస్తుత నివాసంగా క్యాంపు కార్యాలయంగా వినియోగించు కొనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్, నిజామాబాద్ ఎంపి కవిత తదితరులు పాల్గొన్నారు.




Saturday, 21 June 2014

ప్రయాణికుల ఫై 14.2% భారం


​రైల్వే ఛార్జ్ భారీగా పెంపు 
ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైల్వే శాఖ  ఛార్జ్ లను  శుక్రవారం భారీగా  పెంచింది. అన్ని తరగతుల వారికీ 14.2% మోపింది. కఠిన నిర్ణయాలకు దేశం సిద్దంగా వుండాలని ప్రధాని చెప్పిన దాదాపు వారం రోజుల తరువాతా ఛార్జ్ ల మోత మోగింది.

Wednesday, 11 June 2014

Fwd:






అభివృద్ధిని ప్రజా ఉద్యమంగా మారుద్దాం: మోడీ



ఢిల్లీ: స్వాతంత్య్ర ఉద్యమాన్ని మహాత్మాగాంధీ ప్రజల ఉద్యమంగా మలిచారని, ఆయన స్ఫూర్తితో ఇప్పుడు అభివృద్ధిని ప్రజల ఉద్యమంగా మారుద్దామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. లోక్‌సభలో ప్రసంగిస్తున్న ఆయన స్వాతంత్య్ర పోరాటం నాడు మనం పుట్టనందున అందులో పాల్గొనలేకపోయామని, నేడు దేశసేవకోసం జరిగే మరో ప్రజా ఉద్యమంలో అందరం పాల్గొందామన్నారు. మరో ఐదేళ్లలో మహాత్మాగాంధీ 150వ జయంతి జరుపుకోబోతున్నామని, నిష్కళంక భారత్‌ను నిర్మించి మహాత్ముడికి బహుమతిగా ఇద్దామని ప్రధాని పిలుపునిచ్చారు. 2022 నాటికి ప్రతి కుటుంబానికి సొంతింటి కల నెరవేరుద్దామన్నారు