తెలంగాణ వెబ్ న్యూస్;నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి పోయే సమయం ఆసన్నమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మెహన్ రెడ్డి అన్నారు.అందరం కలిసికట్టుగా చంద్రబాబును ఇంటికి పంపేద్దామని చెప్పారు.అనంతపురం జిల్లా పూడేరు సర్కిల్లో మంగళవారం జరిపిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
చంద్రబాబు నాడు శాసనసభలో మాట్లాడినప్పుడు రైతులెవరూ ఆత్మహత్య చేసుకోలేదన్నారని,తీరా తాను పరామర్శ యాత్రకు బయల్దేరుతున్నట్లు తెలియగానే..ఒక్క అనంతపురం జిల్లాలోనే 26 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెబుతున్నారని అన్నారు.అప్పుడు శాసనసభ సమావేశంలో రైతన్నల ఆత్మహత్యలకలు గుర్తుకు రాలేదా అంటూ నిలదీశారు. ప్రశ్నించువారు వస్తున్నారంటే తప్ప చంద్రబాబుకు రైతుల సమస్మలు పట్టవా అని ప్రశ్నించారు.ఎన్నికల ముందు ఇచ్చన హామీలను ..గెలిచిన తర్వాత మర్చిపోయారని వైఎస్ జగన్ చెప్పారు.అనంతపురం జిల్లాకు హంద్రీ నీవా నీళ్లు రావడానికి తానే కారణమని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు.
No comments:
Post a Comment