All meadia

 

Wednesday, 25 February 2015

పరీక్షలో విద్యార్థులు ఎ,గ్రేడ్ సాధించాలి

తెలంగాణ వెబ్ న్యూస్;పరీక్షలో విద్యార్థులకు ఎ,గ్రేడ్ వచ్చే విధంగా ఉపాధ్యాయులు బోధించి  వారి ఉన్నతికి తోడ్పడాలని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ డాక్టర్ రాజారాం అన్నారు.మంగళవారం షాద్ నగర్  పట్టణంలోని ప్రభుత్వ (బాలుర) ఉన్నత పాఠశాల ,ఫరూఖ్ నగర్ మండలంలోని మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత  ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. వచ్చే నెలలో జరగనున్న పదవ తరగతి పరీక్షల్లో గత ఏడాది కంటే ప్రస్తుత విద్యా సంవత్సరం ఉత్తీర్ణత శాతం పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని  అన్నారు.  10 వ తరగతి  విద్యార్థులకు  సబ్జెక్టుల వారీగా క్లుప్తంగా వివరించడంతో పాటు ప్రజెక్టులు నిర్వహించాలని  ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పరీక్షల పట్ల అవగాహన  కల్పించాలని అన్నారు.

No comments:

Post a Comment