తెలంగాణ వెబ్ న్యూస్;వికలాంగులకు యూనిక్ ఐడీ నంబర్ కేటాయించి,సమాజంలో అందరితో సమానంగా విద్య,ఉపాధిఅవకాశాలు రల్పిస్తామని కేంద్రమంత్రి థావర్ చంద్ గెహ్లాట్ పేర్కొన్నారు. విశాఖఏయూలో కేంద్ర వికలాంగుల సాధికారిత శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం 1353 మందికి 1.29 కోట్ల రూపాయల విలువైన 2777 ఉపకరణాలు,సహాయ పరికరాలు,వాహనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గెహ్లాట్ మాట్లాడుతూ ప్రీమెట్రిక్ ,పోస్ట్ మెట్రిక్ చదివే విద్యార్థులకు, విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే వారికి రుణాలు ఇస్తామన్నారు.ఇంటి వద్ద నుంచే ఈ లెర్నింగ్ ,ఆన్ లైన్ ద్వారా చదువుకునే అవకాశం కల్పిస్తామన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో వికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేస్తామన్నారు.80 శాతం పైబడిన అవయవలోపం లక్షల రుణం అందించనున్నామన్నారు.వినికిడి లోపం వున్న ఆరు సంవత్సరాలలోపు పిల్లలకు ఆపరేషన్ నిమిత్తం ఆరు లక్షల రూపాయల వరకు మంజూరు చేస్తామన్నారు.
No comments:
Post a Comment