తెలంగాణ వెబ్ న్యూస్;నిరంకుశ నైజాంను తరిమికొట్టిన తెలంగాణ ఆత్మగౌరవాన్ని స్వార్థంకోసం టీఆర్ ఎస్ ప్రభుత్వం ఢిల్లీగద్దెకు తాకట్టు పెడుతోందని సీపీఎంకేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య అన్నారు.ప్రజల భావోద్వేగాలతో పబ్బం గడుపుకుంటున్న పాలకులకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.సీపీఎం వరంగల్ జిల్లా 18 వ మహాసభలు ములుగులో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ కేసీఆర్ స్వార్ధ ప్రయోజనాల కోసం కేంద్రం వద్ద భిక్షయెత్తుతున్నాడని ధ్వజమెత్తారు.పౌర సన్మానాలపేరుతో కేంద్రమంత్రి దత్తత్రేయ,మహారీష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావులను పొగుడుతూ కేంద్రాన్ని కాకాపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాసమస్యలను మాత్రం విస్మరిస్తున్నారన్నారు.దేహీ అని అడుక్కుంటే హక్కులు రావని,రాజ్యాంగబద్ధంగా పోరాటం చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటాలని సూచించారు.ఇందిరాగాందీ,నాజీవ్ గాంధీ తరహాలో ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రాలహక్కులను కాలరాస్తూ అణగదొక్కుతున్నారని ఆరోపించారు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకొని ప్రజలను తెలియకుండా చేసేందుకే మీడియా పై ఆంక్షలు విధిస్తోందని వీరయ్య ఆరోపించారు. సమాజానికి మిత్రులైన మీడియాను శత్రువులుగా భావిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
No comments:
Post a Comment