తెలంగాణ వెబ్ న్యూస్ ;ప్రయాణికులు ఆన్ లైన్ లో బెడ్ రోల్స్ ను బుక్ చేసుకునే వెసుబాటుకల్పిస్తున్నామని, టికెట్ లేకపోయినా మొబైల్ ఎస్ఎంఎస్ చూపించిప్రయాణించవచ్చని రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు.గురువారం లోక్ సభలో 2015-16 రైల్వే బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆయన విషయాన్ని వెల్లడించారు.రైల్వే ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ నెంబర్ 182 ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.అంతేకాకుండా రైలులో ప్రయాణించే ప్రయాణికులు ఆన్ లైన్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చని చెప్పారు. రైల్వేల్లో తక్కువ ధరకే తాగునీటి సరఫరా కల్పిస్తామన్నారు.
No comments:
Post a Comment