తెలంగాణ వెబ్ న్యూస్, మహాబుబ్ నగర్; ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నవరద నీరు జూరాల ప్రాజెక్టు వద్ద భారీగా నీరు పెరగడంతో ప్రజలు పంటలకు ఢోకా లేదంటున్నారు. ప్రస్తుత నీటి మట్టం 317.75 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 94,229 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 94,124 క్యూ సెక్కులుగా ఉంది. దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు వదులుతూ ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు....
Thursday, 31 July 2014
ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కార్యాలయ ఏర్పాటు
ప్రజా
సమస్యలు తెలుసుకునేందుకు అమీర్ పేట పరిసర ప్రాంతాల్లో సనత్ నగర్ ఎమ్మెల్యే
తలసాని శ్రీనివాస్ యాదవ్ వివిధ శాఖల అధికారులతో పర్యటించారు....
ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కార్యాలయ ఏర్పాటు...
సనత్ నగర్ లో ఏమైనా సమస్య ఉంటే తన మొబైల్ ఫోన్..9848098166కు ఫోన్ చేయండి; తలసాని
తెలంగాణ, వెబ్ న్యూస్, సనత్ నగర్;
ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా
బల్కంపేట బికెగూడ ప్రాంతాల్లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు జి.సత్యనారాయణ యాదవ్,
నాయకులు గులాబ్ సింగ్ రాజ్ పురోహిత్, కరుణాకర్ రెడ్డి, వేదాటి నాగేందర్,
అశోక్ యాదవ్, కమ్మరి వీరేష్, జి.కుమార్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, తిరుపతి
నాయుడు, సక్కుబాయ్, తదితరులు పాల్గొన్నారు.
Tuesday, 29 July 2014
Monday, 28 July 2014
చెస్ పో్టీలో మొదటి బహుమతిని గెలుచుకున్న హిందూ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు...
చెస్ పోటీల్లో గెలుపొందిన మెడల్స్ సర్టిఫికెట్లతో ఆనందం వ్యక్తం చేస్తున్న హిందూ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు....
చెస్ పో్టీలో మొదటి బహుమతిని గెలుచుకున్న హిందూ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు...
తెలంగాణ, వెబ్ న్యూస్; హైదరాబాద్; సనత్ నగర్ హిందూ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు చెస్ పోటీల్లో మొదటి బహుమతిని గెలుచుకున్నారు. గెలుపొందిన క్రీడాకారులను స్వామి వివేకానంద సేవా సమితి ఎడ్యూకేషన్ ట్రస్టు అధ్యక్షులు బూర్గుల శ్యాం సుందర్ గౌడ్ విద్యార్థులను అభినందించారు. ఈ క్రీడల్లో 13 స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. అందులో హిందూ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు మొదటి బహుమతి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాధిక తదితరులు పాల్గొన్నారు
మరిన్ని ఫోటోలు...

Sunday, 27 July 2014
తెలంగాణలో ముగిసిన బోనాల మహోత్సవాలు.....
తెలంగాణ పండుగగా బోనాల పండుగ.....
నగరంలో ముగిసిన బోనాల మహోత్సవాలు...
నగరంలో ముగిసిన బోనాల మహోత్సవాలు...
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్;
భక్త ప్రవత్తులతో మహిళల బోనాల సమర్పణ, పోతురాజుల వీరంగం..... యువతీ, యువకుల డ్యాన్స్ లతో కొత్త రాష్ట్రంలో తెలంగాణ మొదటి బోనాల ఉత్సవాలు ఘనంగా ముగిశాయి..... నాలుగు వారాల పాటు నగరవాసులను ఆధ్యాత్మిక సంద్రంలో ముంచిన ఈ రాష్ట్ర పండుగ తెలంగాణ సంప్రదాయాలను విశిష్టంగా ఆకట్టుకుంది.... ఆదివారం గోల్కొండ కోట, ఖైరతాబాద్, కంటోన్మెంట్, ఎల్బినగర్ లలోనూ ఘనంగా సందడి చేశారు.... డిండి పథకాన్ని పూర్తి చేయాలి; నల్గొండ జడ్పీ .....
హైదరాబాద్, తెలంగాణ వెబ్ న్యూస్; నల్గొండ జిల్లాలో డిండి నీటి పథకాన్ని పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ను కోరుతూ నల్గొండ జిల్లా పరిషత్ తీర్మాణం చేసింది. మూసీనది ప్రక్షాళనకు కూడా చర్యలు తీసుకోవాలని సీఎంకు వారు విన్నవించుకున్నారు....
Friday, 25 July 2014
రైలు ఢీ కన్న సంఘటనలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి
మృతి చెందిన విద్యార్థులకు ఆత్మశాంతి చేకూరాలని సనత్ నగర్ టీఆర్ఎస్ ఇన్ చార్జీ దండె విఠల్ ఆద్వర్యంలో అమీర్ పేట ప్రాంతాల్లో విద్యార్థలచే ర్యాలీ నిర్వహించారు...
రైలు ఢీ కన్న సంఘటనలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి
-----------సనత్ నగర్ ఇన్ చార్జీ దండె విఠల్...
తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; పాఠశాల బస్సును రైలు ఢీ కొన్న సంఘటనలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని సనత్ నగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్ చార్జీ దండె విఠల్ అన్నారు. మెదక్ జిల్లాలోని ముసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద బస్సును రైలు ఢీ కొట్టడంతో 16 మంది విద్యార్థులు మృతి చెందడం పట్ల టీఆర్ఎస్ ఇంచార్జి దండె విఠల్ ఆద్వర్యంలో సత్యం థియేటర్ నుంచి ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర విగ్రహం వరకు వందలాది మంది విద్యార్థులతో శుక్రవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ సంఘటనపై రైల్వే శాఖ పూర్తి బాధ్యత వహించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరి రూ. 5 లక్షల చొప్పన ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తే, కేంద్ర ప్రభుత్వం మాత్రం 2 లక్షల చొప్పున ప్రకటించడం ఎంతో హీనమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు...

Wednesday, 23 July 2014
ఇఎస్ఐ కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం వల్ల రోగులకు కలుగుతున్న ఇబ్బందులపై మంత్రి నాయిని అగ్రహం....
సనత్ నగర్ ఇఎస్ఐ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్...
ఇఎస్ఐ కార్పొరేషన్ ఆసుపత్రిలో పర్యటించిన హోం శాఖ మంత్రి నాయిని.....
Tuesday, 22 July 2014
telangana
విద్యుత్ నియంత్రణ మండలిని ఏర్పాటు చేస్తా: కెసిఆర్
పారిశ్రామిక వేత్తల సమావేశంలో మాట్లాడుతున్న కెసిఆర్
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ మండలిని ఏర్పాటు చేస్తామని, పరిశ్రమలకు మరో ఏడాది కరెంట్ కోతలు లేకుండా చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. మరో సంవత్సరం తరువాత ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. పారిశ్రామిక వేత్తలతో సమావేశం అనంతరం అయన విలేకరులతో మాట్లాడారు.

Friday, 18 July 2014
ఉక్రేయిన్ లో క్షపిని దాడితో కుప్పకూలిన మలేషియా విమానం
ఉక్రేయిన్ లో క్షపిని దాడితో కుప్పకూలిన మలేషియా విమానం
295 మంది దుర్మరణం
ప్రపంచమంతా సంతాపం
ఉక్రేయిన్ లోనెదర్లాండ్ ఓ కర్యలయం వద్ద విమాన దుర్ఘటన మృతులకు నివాళులు అర్పిస్తున్న దృశ్యం.
ఆస్ట్రేలియా: బి-20 సదసులో మలేషియా విమాన దుర్ఘటన మృతులకు నివాళులు అర్పిస్తున్నప్రతినిధులు....
తెలంగాణ వెబ్ న్యూస్, ఇంటర్నేషనల్, హైదరాబాద్: ఉక్రేయిన్ రష్యా సరిహద్దులో జరిగిన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆమ్ స్టర్ నుంచి మలేషియా వెళ్తున్న విమానాన్ని క్షపినితో ఉగ్రవాదులు పేల్చివేసారు. ఈ విమానంలో మొత్తం 295 మంది దుర్మరణం పాలయ్యారు. కొన్ని నెలల తేడాతో మలేషియా దేశం ఎదుర్కొంటున్న రెండు విమాన ఘటనలు యావత్ ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురి చేసాయి. పలు దేశాల్లో సంతాప సభలు, శాంతి ర్యాలీలు జరుగుతున్నాయి. మృతులకు నివాళులు అర్పిస్తున్నారు.
ఇఫ్తాన్ విందులో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్
ముస్లీం మైనార్టీ వర్గాలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని భరోసా
ఇఫ్తాన్ విందులో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్
ముస్లీం మైనార్టీ వర్గాలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని భరోసా
తెలంగాణవెబ్ న్యూస్, హైదరాబాద్: ముస్లీంల సంక్షేమం ఇచ్చిన హామీలను తప్పకుండ నెరవేరుస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ముస్లీంల కోసం 12 శాతం రిజర్వేషన్ వచ్చే ఏడాది కల్పిస్తామని, అప్పుడు ఇక్కడే ఇస్తాన్ విందును జరుపుకుందామన్నారు. ఈ
సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహమద్ అలీ, అహ్మద్ సలీంలకు కెసిఆర్ కర్జుర
పండ్లను తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేసారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి
చైర్మన్ స్వామి గౌడ్, మంత్రులు నాయిని నరసింహ రెడ్డి, మహేందర్ రెడ్డి,
రాష్ట్ర ప్రభుత్వ సహదారు రమణా చారీలు పాల్గొన్నారు.
మరిన్ని ఫోటోలు
బంగారు తెలంగాణా కోసమే రాజకేయల్లో ఉన్నా: కేసిఆర్
బంగారు తెలంగాణా కోసమే రాజకేయల్లో ఉన్నానని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెడితే ఏమవుతుందో అన్న ప్రజల ఆందోళనతోనే మనసును మార్చుకున్నానని కెసిఆర్ పేర్కొన్నారు. గురువారం ఓ టివి ఛానల్ నిరవహించిన ముఖ్యమంత్రితో ముఖాముఖీ కార్యక్రమంలో కేసిఆర్ మాట్లాడారు.
Tuesday, 15 July 2014
బల్కంపేట అమ్మవారులకు ఘనంగా శాఖంబరి అలంకరణ
శాఖంబరి అలంకరణతో బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ అమ్మవారులు.
బల్కంపేట అమ్మవారులకు ఘనంగా శాఖంబరి అలంకరణ
బల్కంపేట అమ్మవారులకు ఘనంగా శాఖంబరి అలంకరణ
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్:
బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారులను ఆలయ నిర్వాహకులు శాఖంబరి అలంకరణతో
అత్యంత వైభవంగా మంగళవారం అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయా నిర్వాహకులు
కె.రఘునందన రావు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాడ మాసంలో అమ్మవారి
ప్రీతిపతమైన మూడవ మంగళవారం రోజున ఈ శాఖంబరి అలంకరణ జరుగుతుందన్నారు.
బాల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారులకు 5 తన్నులతో కూడిన అన్ని రకాల కూరగాయలతో
వేదపండితుల మంత్రోత్సవాల మధ్య అత్యంత వైభవంగా అలంకరించినట్లు ఆలయ ఈవో
రఘునందన రావు తెలిపారు. ఈ మహోత్సవంలో వెలది మంది భక్తులు పాల్గొని
అమ్మవారులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మరిన్ని ఫోటోలు
Saturday, 12 July 2014
ఏడేడ్ వ్యవస్తను కాపాడాల్సిన బాద్యత అందరిపై ఉంది...
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ ఏడేడ్ కాలేజీ లెక్షరర్ అసోసిఎషన్ సభులు...
తెలంగాణ వెబ్ న్యూస్: తెలంగాణ ఏడేడ్ కాలేజీ లెక్షరర్ అసోసిఎషన్ అద్వర్యంలో సోమజిగుడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశం లో సి.విట్టల్, జి.రమణ రావు, కూరపాటి మోహన్ లు మాట్లాడుతూ కేజీ నుంచి పిజీ వరకు ఉచిత విద్యను అందించాలని తెలంగాణా ప్రభుత్వాన్ని కోరారు. ఏడేడ్ కళాశాలల ఉద్యోగుల జీవితాలో సరైన జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఏడేడ్ వ్యవస్తను కాపాడాల్సిన బాద్యత అందరిపై ఉందన్నారు. సరైన పనికి సరైన వేతనాలు కల్పించాలన్నారు. Friday, 11 July 2014
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు సరైన ప్రతినిత్యం కల్పించలేదు.
తెలంగాణ వెబ్ న్యూస్:
కొత్త తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ విషయంలో ఎటువంటి న్యాయం జరగలేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అన్నారు. ఉద్యానవన యునివర్సిటీ మినహా మరి దేనిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించక పోవడాన్ని అయన అసం తృప్తిని వ్యక్తం చేశారు. హర్టి కల్చర్ యునివర్సిటీ కూడా పునర్విభజన బిల్లులో పొందు పరిచిన అంశాలకు కట్టుబడి ఉందని మాటలు మాత్రమే చెప్పారన్నారు. తెలంగాణకు సరైన ప్రతినిత్యం కల్పించలేదని పలువురు తెలంగాణ వాదులు కూడా అభిప్రాయ పడ్డారు.

Thursday, 10 July 2014
ఈ నెల 12 న ఆక్టోపస్ అద్వర్యంలో సాంకేతిక సదసు
తెలంగాణ వెబ్ న్యూస్: కొత్తగా వ్యాపార వాణిజ్య రంగాలలో అడుగుపెడుతున్న వారికోసం పయోనీర్స్ అన్ ప్లగ్ పేరుతో గచ్చిబౌలిలో ఈ సదసును నిర్వహిస్తున్నట్లు రాహుల్ తెలిపారు. ప్రస్తుతం ఇప్పుడున్న టెక్నాలజీ ఎంతో అబివృద్ది చేయవచ్చని తెలిపారు. ఇందులో టెక్నాలజీ నిపుణులు హెల్త్, టెక్నాలజీ బాలాజీ హుట్ల, మురళి, హరిహరన్, కీర్తి, కరుణ గోపాల్ తదితరులు పాల్గొంటారన్నారు.

Wednesday, 9 July 2014
రైతు బంధు పతకం ద్వారా 6 నెలల వరకు వడ్డీ లేని రుణాలు
త్వరలో ''రైతు బంధు'' పతకం ప్రారంభిస్తాం: హరీష్ రావు
ఫైల్ ఫోటో హరీష్ రావు
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: త్వరలో ''రైతు బంధు'' పతకాన్ని ప్రారంబించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ పతకం ద్వారా రైతులకు ద్వారా 6 నెలల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఆయన తెలుపారు. మార్టిగేట్ లేకుండా రైతులకు 2 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇస్తామని అన్నారు. మార్కెట్ యార్డుల్లో మౌలిక వసతులను మెరుగు పరుస్తామని హరీష్ రావు తేలిపారు. ఈ- మార్కెటింగ్ విధానాలను ఖమ్మం జిల్లలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నట్లు వివరాలను వెల్లడించారు. రైతులకు మార్కెటింగ్ అధికార పదవులను ఇస్తామని హరీష్ రావు పేర్కొన్నారు. 2014 రైల్వే బడ్జెట్ లో చైనా, రష్యా దేశాల తరువాతే భరత్...
(ఫైల్ ఫోటో) సదనంద గౌడ
తెలంగాణవెబ్ న్యూస్: హైదరాబాద్:
ప్రయాణికుల భద్రతే తమ ప్రధాన ద్యేయమని కేంధ్ర రైల్వే మంత్రి సదానంద గౌడ్ అన్నారు. సరుకు ప్రపంచంలో అగ్రగామిగా నిలవడమే తమ లక్ష్యమన్నారు. సరుకు రవాణాలో చైనా, రష్యా దేశాల తరువాత తామే ఉన్నామని అయన తెలిపారు. 2.3 కోట్ల మంది ప్రయనికులను సురక్షితంగా గమ్యానికి చేరుస్తుందనారు. 676 ప్రాజెక్టులు ఆమోదిస్తే 356 మాత్రమే పూర్తి అయ్యాయని అన్నారు. పెండింగ్ ప్రాజెక్ట్స్ కోసం రూ. 1.82 లక్షల కోట్లు కావాలని తెలిపారు. 99 కొత్త లైన్లకు 60 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. 10 సంవత్సరాల పటు ప్రతి పాదిత లైన్లకు సంవత్సరానికి 5 లక్షల కోట్లు అవసరమవుతాయన్నారు.
ఈ నెల 12 న అష్టలక్ష్మి యాగం
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ముదిగొండ గోపి కృష్ణ
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: ఎంజికె ఫౌండేషన్ అద్వర్యం లో అష్ట లక్ష్మి దేవస్తానం సహాకారంతో అష్టలక్ష్మి యాగంను జూలై 12 ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కొత్తపేట్ దిలసుఖ్ నగర్ లో ఉంటుందని ముదిగొండ గోపి కృష్ణ అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశామలో ఆయన మాట్లాడుతూ అష్ట లక్ష్మి యాగంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా పాల్గొనవచ్చునన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో రవిశర్మ తదితరులు పాల్గొన్నారు.
Thursday, 3 July 2014
నిజామాబాద్ మేయర్ గులాబీ దే
నిజామాబాద్ నగర మేయర్‌గా ఎన్నికైన ఆకుల సుజాతకు ధ్రువీకరణ పత్రం
అందజేస్తున్న జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ వెంకటేశ్వరరావు
తెరాస ఖాతాలో ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీలు * కామారెడ్డిలో హస్తందే హవా
నిజామాబాద్, తెలంగాణ వెబ్ న్యూస్ జూలై 3: స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికల్లో భాగంగా గురువారం నిర్వహించిన బల్దియాల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలో టిఆర్‌ఎస్‌దే ఆధిపత్యం కొనసాగింది. జిల్లాలో మొత్తం నాలుగు మున్సిపాలిటీలు ఉండగా, వాటిలో నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్ బల్దియాలను తెరాస కైవసం చేసుకుని గులాబీ జెండాలను రెపరెపలాడించింది. ఒక్క కామారెడ్డి మున్సిపాలిటీ మినహా అన్ని చోట్లా బల్దియా పీఠాలు తెరాసకే దక్కాయి.

: ఆటోనగర్ సూర్య
రివ్యూ: ఆటోనగర్ సూర్య
రేటింగ్: 2.5/5
బ్యానర్: ఆర్.ఆర్. మూవీ మేకర్స్
తారాగణం: నాగ చైతన్య, సమంత, సాయికుమార్, మధు, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, అజయ్ తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: శ్రీకాంత్ సరోజ్
నిర్మాత: అచ్చిరెడ్డి
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా
విడుదల తేదీ: జూన్ 27, 2014
షూటింగ్ దశలో చాలా ఇబ్బందులు పడి, విడుదల కోసం నానా తంటాలు పడి.. ఎట్టకేలకు విడుదలైన 'ఆటోనగర్ సూర్య' ఇంతకాలం పడ్డ కష్టానికి తగ్గ సినిమాయేనా? వెన్నెల, ప్రస్థానం చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న దేవా కట్టా తనపై సినీ ప్రియులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడా? యాక్షన్ సినిమాలతో తడబడుతోన్న నాగ చైతన్య ఈసారైనా గాడిన పడ్డాడా?
కథేంటి?
చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న సూర్య (నాగ చైతన్య) ఆటోనగర్‌లో మెకానిక్‌గా జీవనం సాగిస్తాడు. అతడి స్నేహితుడిని ఒక రౌడీ అన్యాయంగా చంపేస్తే... అతడిని చంపి టీనేజ్‌లోనే జైలుకెళతాడు సూర్య. జైలు నుంచి తిరిగొచ్చి బాధ్యతాయుతంగా జీవితం సాగించాలని చూస్తే రౌడీ వ్యవస్థలో అడుగడుగునా అతనికి ఎవరో ఒకరు అడ్డు తగుల్తారు. దానికి సూర్య ఎలాంటి సమాధానం ఇస్తాడు? తన సమస్యని ఎలా పరిష్కరించుకుంటాడు.
Tuesday, 1 July 2014
అత్యంత వైభవంగా బల్కపేట ఎల్లమ్మ కళ్యాణం
అత్యంత వైభవంగా బల్కపేట ఎల్లమ్మ కళ్యాణం
-అమ్మవారి కలయ్ననికి హాజరైన హోం మంత్రి నాయిని, మంత్రి పద్మారావు లు
-శివసత్తులు, పోతురాజుల విన్యాసాలతో దద్దరిల్లిన బల్కంపేట
-ఎర్పట్లని పరిశీలించిన ఎమ్మెల్యే తలసాని...
తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా మంగళవారం చూడ ముచ్చటగా జరిగింది. ఉదయం 11 గంటలకు వేద పండితుల మద్య 11:58 నిమిషాలకు అంగరంగ వైభవంగా నిర్వహించామని ఆలయ నిర్వాహకులు రఘునందన్ తెలుపారు. అమ్మవారి పట్టు వస్త్రాలను ఆలయం నుంచి తెసుకు వచ్చి సనత్ నగర్ ఎమ్మెల్య తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు సమర్పించారు. అడుగడుగునా గట్టి పోలీస్ బందోబస్తు చర్యలు తీసుకున్నారు. అమ్మవారి కళ్యాణం అనంతరం అమ్మవారి లడ్డు రూ. 2,81,500 ఎస్సార్ నగర్ కు చెందిన గందారి రమలక్ష్మి దక్కించుకుంది.ఈ కళ్యాణోత్సవానికి తెలంగాణ హోం మంత్రి నాయిని, మంత్రి పద్మారావులు, బండారు దత్తాత్రేయ, అచ్చంపేట ఎమ్మెల్య బాలరాజు తో ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో బల్కంపేట కార్పోరేటర్ శేషుకుమారి, శ్రీపతి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారికి వస్త్రాలు తీసుకు వెళ్తున్న ఎమ్మెల్యే తలసాని, శేషుకుమారి
అమ్మవారి కల్యాణానికి హాజరైన సికింద్రాబాద్ ఎంపి బండారు దత్తాత్రేయ
అమ్మవారి లడ్డు 2,81,500 లక్షలకు ఎస్సార్ నగర్ కు చెందిన గందారి రమలక్ష్మిదక్కించుకుంది
అమ్మవారి కల్యాణానికి పోటెత్తిన భక్తులు
తెలంగాణ హోం మంత్రి నాయిని, మంత్రి పద్మారావు,
తెలంగాణ హోం మంత్రి నాయిని
సనత్ నగర్ ఎమ్మెల్య తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు
Subscribe to:
Posts (Atom)