తెలంగాణ వెబ్ న్యూస్;వినేవాడు లోకువైతే చెప్పేవాడు చంద్రబాబు అన్న సూక్తి మరోమారు రుజువు అయింది గండికోట ప్రాజెక్టుకు శంకుస్థాపన మినహా ఆ ప్రాజెక్టు సాధనలో గతంలో ఏమాత్రం చిత్తశుద్ది ప్రదర్శించలేదు. ఇప్పుడేమో తానే నీళ్లు తెస్తున్నానని ప్రకటిస్తున్నారు.తొమ్మిది సంవత్సరాల చంద్రబాబు హయాంలో కేవలం రూ.19 కోట్లు మాత్రమే ఖర్చు చేశారంటే దీనిపై ఆయనకున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం అవుతుంది.పైగా జిఎన్ఎస్ఎస్ సాధ్యం కాదని కృష్ణ స్వామి కమిటీ ఏర్పాటు చేసి రద్దు చేయాలని చూశారు.3 టీఎంసీల సామర్థ్యంతో పెన్నా వరదను ఆధారంగా చేసుకుని నిర్మిస్తే సరిపోతుందని అప్పట్లో ప్రాజెక్టుకు గండికొట్ట బోయారని సాగునీటి రంగ నిపుఫులు ఆరోపిస్తున్నారు.
No comments:
Post a Comment