All meadia

 

Thursday, 19 February 2015

తెలంగాణ కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు

తెలంగాణ వెబ్ న్యూస్;తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో కేసీఆర్ కుటుంబానికి,ఆయన అనుచర గణానికే ఉద్యోగాలు దక్కాయని,ఎన్నో త్యాగాలు చేసిన యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నేతలు ధ్వజమెత్తారు.ఎనిమిది నెలల కాలంలో ఒక్కరికీ ఉద్యోగం రాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.  నియామకాలు,నిధులు
నీళ్ల కోసం తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని,ఇందులో  యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారని,తీరా తెలంగాణ వచ్చాక వారిని పట్టించుకోవడం లేదని వారన్నారు.తమ కుటుంబ సభ్యులకు పదవులు వస్తే చాలని సీఎం భావిస్తున్నారని,నిరుద్యోగులను పూర్తిగా  విస్మరించారని చెప్పారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని,విద్యాసంవత్సరం ముగింపునకు వచ్చినా ఇప్పటి వరకు బోధనరుసుములు చెల్లించలేదని విమర్శించారు.టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య,సీఎల్పీ నేతలు జానారెడ్డి,డి.శ్రీనివాస్ ల సూచనల మేరకు నిరుద్యోగులు,విద్యార్థుల సమస్యలపై టీపీసీీసీ ఆధ్వర్యంలో విద్యార్థి,యువజన సంఘర్షణ సమితిని ఏర్పాటు చేశామని,తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పారు.

No comments:

Post a Comment