All meadia

 

Sunday, 8 February 2015

తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్స్ 12 నుంచి


telangana web news : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను ఈ నెల 12 నుంచి నిర్వహించనున్నట్లు ఆర్‌ఐఓ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 4 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయం త్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని వివరించారు. 5 రోజుల చొప్పున 4 విడతల్లో పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పరీక్షల కోసం జంటనగరాల్లో 131 కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేశామని రవికుమార్ వెల్లడించారు. ప్రాక్టికల్ పరీక్షల ఫలితాలను థియరీ మార్కులతో కలుపుతారు. ఈ మార్కులు ఎంసెట్, ఇతర పోటీ పరీక్షల వెయిటేజీలో స్కోరింగ్ కోసం ఉపయోగపడతాయి. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు 60 మార్కులు, ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 150 చొప్పున మార్కులు ఉంటాయి.

No comments:

Post a Comment