.
Saturday, 21 February 2015
పత్రికా ప్రకటన-1 21,ఫిబ్రవరి, 2015 తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ.పది లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మొదటి విడతలో గుర్తించిన అమరవీరుల కుటుంబాలకు పదిలక్షల రూపాయల చొప్పున ఆర్థికసహాయం అందించాలని ఆదేశించారు. ఆయా జిల్లాల మంత్రులు, కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని కోరారు. శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం, బీడీ కార్మికుల భృతి, ఫార్మసీ పరిశ్రమకు చేయూత తదితర అంశాలపై సమీక్షించారు. మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్థిక శాఖ కార్యదర్శులు నాగిరెడ్డి, రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 1. అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమర వీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించే విషయంపై మార్గదర్శకాలు రూపొందించాలని, ప్రతిపాదనలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కుటుంబంలో ఎవరికి ఉద్యోగ అవకాశం కల్పిం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment