తెలంగాణ వెబ్ న్యూస్;పిల్లలే నేడు దేశానికి అపార ఆస్తి.వారి కోసం ఎంత ఖర్చయినా వెనుకాడం.ఇంటర్ పూర్తయిన తరవాత కోరుకున్నచోట చదువుకునేందుకు ఆర్థికంగా అన్నివిధాలా సహకరిస్తాం.తద్వారా మున్ముందు రాష్ట్రాన్ని సరస్వ తీధామంగా తీర్చిదిద్దుతాం అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.పదోతరగతి,ఇంటర్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించేందుకు తిరుపతిలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.సభకు విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాస రావు అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ...ప్రపంచాన్ని జయించే శక్తి,శాసించే శక్తి యువతకే ఉందన్నారు.
అవసరమైతే అప్పుచేసయినా సరే ప్రతిభకలవారిని ఉన్నతవిద్యావంతులుగా తీర్చిదిద్దుతామని విద్యార్థినీ విద్యార్థుల హర్షధ్వానాల నడుమ చంద్రబాబు ప్రకటించారు.
No comments:
Post a Comment