All meadia

 

Tuesday, 17 February 2015

ముఖ్యమంత్రి కార్యాలయము తెలంగాణ ప్రభుత్వం పత్రికా ప్రకటన-217, ఫిబ్రవరి, 2015 తెలంగాణ , మహరాష్ట్ర మధ్య నిర్మించ తలపెట్టిన అంతరాష్ట్ర నీటి పారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని తెలంగాణ, మహరాష్ట్ర ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌ రావు, దేవేంద్ర ఫడ్నవీస్‌ నిర్ణయించుకున్నారు. ముంబాయిలోని రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రులు ఇద్దరూ మంగళవారం సమావేశమయ్యారు. మంత్రులు టి.హరీష్‌రావు, జోగురామన్న, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, వేణుగోపాలాచారి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఎంపీలు బి. వినోద్‌కుమార్‌, బివి.పాటిల్‌, నీటి పారుదల శాఖ కార్యదర్శి ఎస్‌కె.జోషి, ఇఎన్‌సి మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ, మహరాష్ట్రాల మధ్య వున్న నీటిపారుదల ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసుకొని రెండు రాష్ట్రాల్లో రైతులకు సాగునీరు అందించాలని ప్రజలకు తాగునీరు అందించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. రెండు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేసి గోదావరి నదీ జలాలను సమర్దవంతంగా ఉపయోగించుకోవాలని తీర్మానించుకున్నారు. భూసేకరణ, నష్ట పరిహారం చెల్లింపు, కోర్టు కేసుల పరిష్కారం, ముంపు ప్రాంత ప్రజల అభ్యంతరాలు తదితర అంశాలను చ

.

No comments:

Post a Comment