తెలంగాణ వెబ్ న్యూస్;భూసేకరణ చట్టం రైతుల సంక్షేమం,అభివృద్ధి కోసమే తీసుకొస్తున్నామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని సామాజిక ఉద్యమకారుడు,గాంధేయవాది అన్నాహజారే ఆరోపించారు.దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రైతులను ఉద్దేశించి బుధవారం ఆయన ప్రసంగించారు.ఎన్నికల ముందు నల్లధనం వెనక్కు,అధికార వికేంద్రీకరణ లాంటి ఎన్నో హామీలను ఇచ్చి భాజపా నాయకులు ప్రజలను తప్పుదారి పట్టించారన్నారు.రైతుల విన్నపాలు వినకపోతే పెద్ద ఎత్తున జైల్ బారో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఇంతకు ముందున్న యూపీఏ ప్రభుత్వం తను చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి తట్టుకోలేకపోయిందని, మహారాష్ట్రలో సైతం ఆరుగురు రాష్ట్ర మంత్రులు రాజీనామా చేశారని గుర్తుచేశారు.ఎనిమిది నుంచి పది మందితో ఒక కమిటీని రూపొందించి,జైల్ బారో యాత్రకు కార్యచరణ రూపొందిస్తామన్నారు. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాష్ట్ర సచివాలయం సందర్శనకు తనను ఆహ్వానించారని.రైతు సంఘం నాయకులను కలవాల్సి ఉండటం వల్ల కుదరలేదని తెలిపారు. మళ్లీ దిల్లీకి వచ్చేటప్పుడు కచ్చితంగా దిల్లీ అసెంబ్లీ సందర్శిస్తానని వివరించారు.
No comments:
Post a Comment