All meadia

 

Friday, 27 February 2015

Coins history

ఏ నాణెం ఎక్కడ తయారయింది ?
**********************************
రూపాయి నాణెం చూసి.. అదెక్కడ తయారైందో చెప్పగలరా ? 'మింట్'లో.. అని చెబుతారా ? అది సరే.. ఎక్కడి మింట్‌లో తయారైంది అని అడిగితే చెప్పగలరా ? మీకీ విషయం తెలుసా ? ప్రతి నాణెం అదెక్కడ తయారైందో తెలిపే సూచిక దానిపైనే ఉంటాయి. వాటి సంగతేంటో.. ఇక్కడ తెలుసుకుందాం.

★ నాణెం ముద్రణా సంవత్సరం కింది భాగంలో 'డైమండ్' గుర్తు ఉంటే.. అది ముంబై మింట్‌లో తయారైనట్లు లెక్క.

★ ముద్రణా సంవత్సరం కింది భాగంలో ఎలాంటి గుర్తు ఉండకుంటే.. అది కచ్చితంగా కోల్‌కతా మింట్నాణెమే.

★ ముద్రణా సంవత్సరం కింది భాగంలో 'చీలిన డైమండ్' (స్ల్పిట్ డైమండ్) లేదా 'చుక్క' (డాట్) లేదా 'స్టార్' (నక్షత్రం) ఉందంటే.. అది మన హైదరాబాదీ మింట్ తయారీయే.

★ ముద్రణా సంవత్సరం కింద 'గుండ్రని బిందువు' (రౌండ్ డాట్) ఉంటే.. అది నోయిడా మింట్ నాణెమన్న దానికి సంకేతం.

★ ఇవేవీగాకుండా నాణెంపై ఇతర చిహ్నాలుంటే అవి విదేశీ మింట్‌లలో తయారైనట్టు లెక్క.

No comments:

Post a Comment