All meadia

 

Friday, 17 July 2015

KTR PRESS MEETING

NABARD MEEt
తెలంగాణ తాగునీటి పథకంలో భాగం అవుతున్నందుకు గర్వంగా ఉం ది- నాబార్డ్

ప్రతిష్టాత్మకమైన తెలంగాణ తాగునీటి పథకంకు ఈ సంవత్సరం 3000 కోట్ల రుణం ఇస్తామని నాబార్డ్ హామి ఇచ్చింది.. ఈ నెలలోనే ఆ మొత్తాన్ని అందిస్తామంది.. ముంబై నుంచి వచ్చిన నాబార్డ్ అధికారుల బృందం పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి  రేమండ్ పీటర్ , ఆర్.డబ్యు.ఎస్.ఎస్ ఇంజనీర్ ఇన్ ఛీప్ సురేందర్ రెడ్డితో సమావేశమైంది.. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పథకం ఆలోచన,అమలు అద్భుతంగా ఉందని నాబార్డ్ అధికారులు ప్రశంసించారు..నిన్న గజ్వెల్ ,సింగూరుతో పాటు ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించిన నాబార్డ్ అధికారులు..తమ అనుభవాలను పంచుకున్నారు..పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు..కోట్లాదిమందికి తాగునీటిని అందించే ఈ పథకం కోసం గ్రామీణ తాగునీటి సరాఫరా,పారిశుద్ధ్య శాఖ ఇంజనీర్లు  రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని రేమంట్ పీటర్ చెప్పారు..వాటర్ ప్రాజెక్టును కేంద్రం ప్రశంసించిన తీరుతో పాటు పథకంలో భాగంగా ఆఫ్టిక్ కేబుల్ వైర్ తో ఇంటింటికి ఇంటర్ నెట్ కనెక్షన్ ఇస్తున్నవిషయాలను నాబార్డ్ అధికారులకు  వివరించారు..మొత్తం ప్రాజెక్టులో 10% నీటిని పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించామని, మున్సిపాలిటీలకు శుద్ది చేసిన నీటిని {TREATED WATER } అందిస్తామన్నారు.ఆ తర్వాత ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ప్రదీప్ చంద్రను అధికారులు కలిశారు.ఈ సమావేశంలో ఆర్.డబ్యు.ఎస్అండ్ ఎస్ ఈఎన్ సి సురేందర్ రెడ్డితో పాటు ఆ శాఖ ఇంజనీర్లు, ముంబై నుంచి వచ్చిన నాబార్డ్ అధికారులు సివి రెడ్డి,మిశ్రా తో పాటు హైదరాబాద్ నాబార్డ్ కేంద్ర అధికారులు ఉమేష్ శివ్ డే, హర గోపాల్, సత్యానారాయణ, బక్కారెడ్డి  పాల్గొన్నారు..

Thursday, 16 July 2015

Train No. 12723 / 12724 Hyderabad – New Delhi – Hyderabad Andhra Pradesh Express will be renamed as “Telangana Express” with effect from 15th November, 2015. ****

Press meet

Dear Sir/Madam,
Press Club & Regional Passport Office jointly organizing Press meet tomorrow 3 pm at Press Club Somajiguda. The Press meet will be addressed by Ashwini Sattaru,RPO-Hyderabad.
On behalf of Press Club Managing Committee we personally invite you to attend the Press Meet and cover the event in your esteemed media.
Thanking You,
Press Club Hyderabad.

Adhar card through passport in 10days

Facebook Articles Like and Share Sneha Hastam Development Society - ఆధార్ కార్డు ఉంటే 10 రోజుల్లో పాస్‌పోర్ట్..!
ఆధార్ కార్డు ఉన్న వారికి ఓ శుభవార్త. ఆధార్ కార్డు ఉన్నవారు 10 రోజుల్లో పాస్‌పోర్ట్ పొందే అవకాశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కల్పిస్తోంది. ఇందుకోసం ఆధార్ కార్డు సమాచారాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోతో అనుసంధానం చేయనున్నారు. ఇలా చేయడం వల్ల దరఖాస్తుదారుని(ఆమె/అతడు) గత నేర చరిత్ర ధ్రువీకరణ కోసం గుర్తింపుగా ఆధార్ కార్డును వినియోగించనున్నట్లు శాఖ అధికారి తెలిపారు. కొత్త, తత్కాల్ పాస్‌పోర్టులకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుని పౌరసత్వం, నేర పూర్వాపరాలు, నేరారోపణలను లాంటి వాటిని పోలీసు తర్వాత ధృవీకరించనున్నారు. ప్రస్తుతం పాస్ పోర్టుల జారీ విషయంలో పోలీసు ధృవీకరణ ఆలస్యం అవతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ తాజా ఫార్మెట్‌లో దరఖాస్తుదారు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. గుర్తింపు మరియు చిరునామా కింద ఆధార్ కార్డు తప్పనిసరి. దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లో దరఖాస్తుదారు అపాయింట్మెంట్ పొందుతారు. మరొక ఏడు రోజుల్లో, పాస్ పోర్ట్‌ని ప్రాసెస్ చేసి ఇంటికి పంపడం జరుగుతుంది. ఆ తర్వాత పోలీసు ధృవీకరణ కోసం ఇంటికి వస్తారు. పాస్ పోర్టు జారీల విషయంలో జరుగుతున్న ఆలస్యాన్ని అధిగమించడానికి ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం, ఇంటిలిజెన్స్ బ్యూరో విభాగంతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధార్ కార్డుని తప్పనిసరి చేసింది. దీనిని అమలు చేసేందుకు యుఐడిఎఐతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయం చేసుకుంటుంది

Saturday, 11 July 2015

Godavari pushkaralu info

Godavari Pushkar Ghats in Telangana State
Warangal District
1 Mallakatta (V), Etunagaram(M)
2. Ramannagudem (V), Etunagaram(M)
3. Mangapet (V), Mangapet(M) Khammam District
4. Vista Complex at Bhadrachalam (V&M)
5. Bhadrachalam (V&M)
6. Ramaghat at Parnashala (V), Dummugudem (M)
7. Seethaghat at Parnashala (V), Dummugudem (M)
8. Near Anjaneyaswamy temple at Ramachandrapuram (V), Venkatapuram (M)
9. RHS of Godavari river at Shivalayam, Chinnarayigudemm, Manuguru Mandal Adilabad District
10. Basar (V), Mudhole(M) 11. Wastatur (V), Lokeshwaram (M),
12. Soan (V), Nirmal (M),
13. Khannapur (V&M),
14. Chinthaguda (V) Jannaram(M),
15. Seetharampally & Mulkala (V), Mancherial (M),
16. Luxettipet (V), Luxettipet (M),
17. Gudem (V), Dandepally (M),
18. Vellala (V), Jaipur (M), 19. Chennur (V), Chennur (M),
20. Chinthalachanda (V), Laxmanchanda (M),.
21. Hanman Temple, Peechara(V), Laxmanchanda (M),
22. Sangvi (V), Dilwarpur (M),
23. Nagulamma Temple Ponkal (V), Mamda (M),
24. Dwaraka (V), Dandepally (M),
25 Timbareni (V), Dilwarpur (M),
26. Bridge in Kamalkot (V), Manda (M),
27. Asta (V), Mudhole (M), 28. Kawtha (V), Mudhole (M),
29. Swarwagaon (V), Mudhole (M) Karimnagar District
30. Dharmapuri (V) & (M) 31. Main Ghat at Santhoshimata Temple Dharmapuri (V) & (M)
32. Main Ghat Mangatigadda Somavihar ghat No. 2 Dharmapuri (V) & (M)
33. Mahalaxmi temple Dharmapuri (V) & (M)
34. Thimmapur (V) Dharmapuri (M)
35. Kaleshwaram (V) & Mahadevpur (M)
36. Kotilingala (V) & Velgatoor(M)
37. Manthani (V) & (M),
38. Eardhandi (V), Ibrahimpatnam (M)
39. Ramalayam at Walgonda (V), Mallapur (M) 40. Hanuman Temple at Walgonda (V), Mallapur (M) 41. Hanuman Temple at Gangamma Temple (Front side) at Vempally Venkatraopet (V), Mallapur (M)
42. Ramalayam Bornapally (V), Raikal (M)
43. Kammunur (V), Sarangapur (M)
44. Vemulakurthy (V) Ibrahimpatnam (M)
45. Komatikondapur (V) Ibrahimpatnam
46. Fakirkondapur (V), Ibrahimpatnam (M)
47. Mularampur (V), Ibrahimpatnam (M)
48. Komatikondapur(V) Ibrahimpatnam (M)
49. Ratnalamadugu Vemulakurthi , Yamapur(V), Ibrahimpatnam (M)
50. Mogilipet (V), Mallapur(M)
51. Obulapur(V), Mallapur(M)
52.Kotha Dhamrajpally (V), Mallapur (M)
53. Patha Dhamrajpally (V), Mallapur (M) Nizamabad District
54. Sri.Shivalayam temple (Thriveni Sangamam), Kandakurthy (V), Renjal (M), 55. Hanuman temple, Kosli(V), Navipet (M),
56. Sri.Shivalayam and Hanuman temple, Thadbiloli (V), Renjal (M),
57. Sri. Gouthameshwara Swami temple, Binola (V), Navipet (M),
58. Sri. Hanuman temple, Tungini(V), Navipet (M),
59. Tadpakal (V), Morthad (M).
60. Ummeda (V), Nandipet (M).
61. SRSP Camp colony, Pochampadu (V), Balkonda (M).
Surapuram Laxmikanth, Vasavi club Narayanpet.  Prasident

Friday, 10 July 2015

Bahubali mania

బాహుబలి 'బిగ్' మానియా

హైదరాబాద్: బాహుబలి ఓ పెద్ద సినిమా అని అందరికీ తెలిసిందే. కానీ ఇందులో ఏయే పెద్ద విషయాలు ఉన్నాయో చూద్దాం.

►బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4250 థియేటర్లలో విడుదలైంది.
►తొలి రోజు మొత్తం 15 వేలు ఆటలు ప్రదర్శించనున్నారు.
►ఈ సినిమా నాలుగు భాషల్లో విడుదలైంది.
►తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో మొత్తం 1600 థియేటర్లలో విడుదలైంది. మొత్తం థియేటర్లలో ఇది 90 శాతం.
►తమిళనాడులో 350, కర్ణాటకలో 225 థియేటర్లలో విడుదలైంది.
►పశ్చిమ బెంగాల్ లో 100 స్క్రీన్లు.. ఇతర దేశాల్లో 135 కు పైగా థియేటర్లలో విడుదలైంది.
►మలయాళంలో కేరళలోని మాయాజాల్ సినీ కాంప్లెక్స్లో 40 షోలు ప్రదర్శితం.
►తమిళ భాషలో 19 షోలు. మొత్తం 59 షోలు.. అంటే ఇదే ఇప్పటిదాకా రికార్డు.
►ఒక్కో టికెట్ ధర రూ.8వేల దాకా అమ్ముడుపోయింది.
►ఇంతవరకు ఏ ఇండియన్ చిత్రం కూడా రూ.250 కోట్లు క్రాస్ చేయలేదు. శంకర్ - రజనీకాంత్ కాంబినేషన్ రోబో కూడా రూ.150 కోట్లే కలెక్షన్స్ సాధించింది.
►ఈ సినిమా తీయడానికి మూడేళ్లు పట్టింది. గ్రాఫిక్స్ కోసం ఆరు నెలల పాటు షిఫ్టుల వారీగా 600 మంది పని చేశారు.
►ఈ సినిమా కోసం ప్రభాస్ తన వివాహాన్ని కూడా వాయిదా వేసుకున్నారనే రూమర్ హల్ చల్ చేస్తోంది.
►మూవీ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే మిలియన్ల ప్రేక్షకులు వీక్షించారు.
►ఈ సినిమా పోస్టర్ 50 వేల చదరపు అడుగులతో కేరళలో ఉంచారు. ఇది గిన్నిస్ రికార్డు.
►బాహుబలి సినిమా కోసం ఆరు పెద్ద సినిమాల విడుదల వాయిదా పడింది.
►వాటిలో మహేశ్ బాబు  - శ్రీమంతుడు, రవితేజ - కిక్-2, గుణశేఖర్ - రుద్రమదేవి, మంచు విష్ణు - డైనమైట్ చెప్పదగినవి.

Bahubali REVIEW

సినిమా: బాహుబ‌లి
న‌టీన‌టులు: ప‌్ర‌భాస్‌, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌, నాజ‌ర్‌, స‌త్య‌రాజ్‌, సుదీప్ త‌దిత‌రులు
బ్యాన‌ర్‌: ఆర్కా మీడియా
స‌మ‌ర్ప‌ణ‌: కె.రాఘ‌వేంద్ర‌రావు
సంగీతం: ఎంఎం.కీర‌వాణి
సినిమాటోగ్ర‌ఫీ: ఎస్‌కె.సెంథిల్ కుమార్‌
ఫైట్స్‌: పీట‌ర్ హెయిన్స్‌
క‌థ‌: విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌
నిర్మాత‌లు: దేవినేని ప్ర‌సాద్‌, శోభు యార్ల‌గ‌డ్డ‌
ద‌ర్శ‌క‌త్వం: ఎస్ఎస్‌.రాజ‌మౌళి
ర‌న్ టైం: 159 నిమిషాలు
సెన్సార్ స‌ర్టిఫికేట్‌: యూ/ఏ
రిలీజ్‌డేట్‌: 10 జూలై, 2015

బాహుబ‌లి..బాహుబ‌లి…బాహుబ‌లి కొద్ది రోజులుగా టాలీవుడ్, కోలీవుడ్‌, మ‌ల్లూవుడ్‌, బాలీవుడ్‌, ఓవ‌ర్సీస్ ఇలా ఎక్క‌డ చూసినా స‌గ‌టు సినిమా అభిమాని నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు బాహుబ‌లి మానియా ఊపేసింది. టాలీవుడ్‌లో అప‌జ‌య‌మే లేకుండా హిట్లు ఇస్తున్న ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి రెండున్న‌ర సంవ‌త్స‌రాలుగా క‌ష్ట‌ప‌డి తెర‌కెక్కించిన ఈ భారీ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం రిలీజ్‌కు ముందే ఎన్నో సంచ‌ల‌నాల‌కు కార‌ణ‌మైంది. యంగ్‌రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌, నాజ‌ర్‌, స‌త్య‌రాజ్ లాంటి భారీ తారాగ‌ణంతో రూ.250 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన బాహుబ‌లికి తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే ఏ సినిమాకు రాని విధంగా రిలీజ్‌కు ముందే హైప్ వ‌చ్చింది. బాహుబ‌లి దెబ్బ‌కు అన్ని రికార్డులు ఖ‌ల్లాసే ఈ మాటే కొద్ది రోజులుగా ఎవ్వ‌రి నోట విన్నా విన‌ప‌డ్డాయి. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న ఈ సినిమాపై ఉన్న భారీ అంచ‌నాల‌ను అందుకుందా లేదా అన్న‌ది నేటిసినిమా.కామ్ స‌మీక్ష‌లో చూద్దాం.

బాహుబ‌లి స్టోరీ సింగిల్ లైన్‌:
బాహుబ‌లి తొలి భాగంలో ఓ రాజ్యం కోసం అన్న‌ద‌మ్మ‌లు మ‌ధ్య జ‌రిగిన పోరులో స‌వ‌తి త‌మ్ముడు అన్న‌ను చంపి రాజ్యాన్ని హ‌స్త‌గ‌తం చేసుకుంటే…చ‌నిపోయిన అన్న కుమారుడు తన తండ్రికి జ‌రిగిన అన్యాయం తెలుసుకుని, త‌న త‌ల్లి కోసం ఆ రాజ్యంలోకి ఎంట‌ర్ అవుతాడు.

బాహుబ‌లి స్టోరీ:
అన‌గ‌న‌గా ఓ అడ‌విగూడెంలో శివుడు (ప్ర‌భాస్‌) త‌న జాతితో క‌లిసి పెరుగుతుంటాడు. శివుడు త‌ల్లి సంగం. బ‌లంలోను, తెలివిలోను ప‌రాక్ర‌మ‌వంతుడైన శివుడు అక్క‌డ‌కు వ‌చ్చిన అవంతిక (త‌మ‌న్నా)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. అవంతిక మ‌హిష్మ‌తి రాజ్యంలో ఉన్న దేవ‌సేన (అనుష్క‌) ను విడిపించేందుకు పోరాడుతున్న బృందానికి నాయ‌క‌త్వం వ‌హిస్తుంది. మ‌హిష్య‌తి రాజ్యంలో భ‌ల్లాల‌దేవుడు ప్ర‌జ‌ల‌ను క్రూరంగా హింసిస్తూ ప‌రిపాల‌న చేస్తుంటాడు. అవంతిక కోసం శివుడు మ‌హిష్మ‌తి రాజ్యంలోకి ఎంట‌ర్ అవుతాడు. శివుడు అక్క‌డ నుంచి దేవ‌సేన‌(అనుష్క‌)ను విడిపించుకుని వ‌స్తాడు. ఆ త‌ర్వాత శివుడికి ఆ రాజ్య సేనాధిప‌తి (క‌ట్ట‌ప్ప‌) ద్వారా కొన్ని ఊహించ‌ని నిజాలు తెలుస్తాయి. అసలు శివుడు ఎవ‌రు, అత‌డికి మ‌హిష్మ‌తికి సంబంధం ఏమిటి..? దేవ‌సేన 25 ఏళ్లుగా అక్క‌డ ఎందుకు బందీగా ఉన్న‌ది అన్న‌దే స‌స్పెన్స్‌.

ఈ స్టోరీ ఇలా ఉంటే అన‌గ‌న‌గా ఓ మ‌హిష్మ‌తి రాజ్యం ఆ రాజ్యాన్ని ప‌రిపాలించే రాజు అవిటి వాడైన బ‌జ్జ‌ల‌దేవుడు(నాజ‌ర్‌)కు బ‌దులుగా అమ‌రేంద్ర బాహుబ‌లి(ప్ర‌భాస్‌) తండ్రిని రాజుగా చేస్తాడు. అయితే ఆ క్ర‌మంలో బాహుబ‌లి త‌ల్లిదండ్రులిద్ద‌రు మ‌ర‌ణిస్తారు. అయితే బిజ్జ‌ల‌దేవుడు భార్య శివ‌గామి (ర‌మ్య‌కృష్ణ‌) రాజ్యాన్ని కంటికి రెప్ప‌లా కాపాడుకుంటూ అటు బాహుబ‌లితో పాటు ఇటు త‌న కుమారుడైన భ‌ల్లాల‌దేవుడు (దగ్గుపాటి రానా) ఇద్ద‌రిని క‌న్న కొడుకులుగా పెంచుతుంది. వీరిద్ద‌రిలో స‌మ‌ర్థులైన వారికే రాజ్య ప‌ట్టాభిషేకం చేయాల‌ని ఆమె భావిస్తుంది. అయితే స్వార్థ‌ప‌రుడైన బిజ్జ‌ల‌దేవుడు త‌న కుమారుడైన భ‌ల్లాల‌దేవుడే రాజు కావాల‌ని కుతంత్రాలు పన్నుతుంటాడు. భ‌ల్లాల‌దేవుడు కూడా బాహుబ‌లిని అంత‌మొందించి తానే మ‌హిష్మ‌తి రాజు అవ్వాల‌ని ఓ సారి బాహుబ‌లిని అంత‌మొందించే ప్ర‌య‌త్నం చేసినా మ‌హిష్మ‌తి సైన్యాధిప‌తి క‌రికాల క‌ట్ట‌ప్ప (స‌త్య‌రాజ్‌) వ‌ల్ల అది బెడిసికొడుతుంది. ఇదిలా ఉండ‌గా మ‌హిష్మ‌తి రాజ్యానికి భ‌యంక‌రులైన కాల‌కేయుల నుంచి ప్ర‌మాదం పొంచి ఉంటుంది. వారి నాయ‌కుడైన కాల‌కేయుడు (ప్ర‌భాక‌ర్‌) మ‌హిష్మ‌తిపై దండెత్తుతాడు. ఆ భ‌యంక‌ర పోరాటంలో త‌న ఇద్ద‌రు కుమారుల్లో ఎవ‌రు విజేత‌ల‌వుతారో వారినే ప‌ట్టాభిష‌క్తుడ్ని చేస్తాన‌ని శివ‌గామి చెపుతుంది. ఈ యుద్ధంలో శివ‌గామి కుమారుడు భ‌ల్లాల‌దేవుడు కాల‌కేయుడ్ని అంత‌మొందిస్తాడు. అయితే శివ‌గామి మాత్రం బాహుబ‌లిని రాజును చేస్తుంది. శివ‌గామి త‌న సొంత కుమారుడిని కాద‌ని బాహుబ‌లిని ఎందుకు ప‌ట్టాభిష‌క్తుడిగా ప్ర‌క‌టించింది. గూడెంలో పెరిగిన శివుడికి, ఈ బాహుబ‌లికి సంబంధం ఏమిటి.? దేవ‌సేన‌కు బాహుబ‌లికి సంబంధం ఏమిటి ? బాహుబ‌లిని ఎంతో ఆరాధించే సైన్యాధిప‌తి క‌ట్ట‌ప్పే బాహుబ‌లిని ఎందుకు చంపాడు ? అన్న‌ది తెలియాలంటే బాహుబ‌లి చూసి తెలుసుకోవాల్సిందే.

బాహుబ‌లి విశ్లేష‌ణ‌:
భార‌త‌దేశ‌పు చ‌రిత్ర‌లోనే తొలి మోష‌న్ పిక్చ‌ర్‌గాను..టాలీవుడ్ చ‌రిత్ర‌ను మార్చే సినిమాగాను చెప్పుకుంటున్న బాహుబ‌లి ఫ‌స్ట్‌హాఫ్ శివుడు క్యారెక్ట‌ర్‌తో మొద‌ల‌వుతుంది. కొండ కోన‌ల్లో పెరిగే శివుడు అంద‌మైన జ‌ల‌పాతాల మ‌ధ్య గెంతులేసే విజువ‌ల్స్ చూడ‌డానికి రెండు క‌ళ్లు చాల‌వ‌న్న‌ట్టుగా ఉంటుంది. ఒంటినిండా సీతాకోక‌చిలుక‌లు ప‌ర‌చుకుని దేవ‌క‌న్య‌లా ఎంట్రీ ఇచ్చిన త‌మ‌న్నా ప్ర‌భాస్‌తో సైతం యుద్ధం చేసి మొప్పించి చివ‌రికి అత‌డి ముగ్గులో ప‌డుతుంది. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఎంచుకున్న స్టోరీ లైన్ చూస్తే రాజ్యం, రాజులు, అన్న‌ద‌మ్మ‌లు ఘ‌ర్ష‌ణ‌లు, కుతంత్రాలు, వెన్నుపోటే రాజ‌నీతి ఈ స్టోరీని మ‌నం ఎప్ప‌టి నుంచో చూస్తేనే ఉన్నాం. అయితే దానిని జ‌క్క‌న్న ప్ర‌స్తుత ట్రెండ్‌కు త‌గిన‌ట్టుగా ఎలా రంజిప‌చేస్తాడన్న‌దానిపైనే కాన్‌సంట్రేష‌న్ ఉంది.

రాజ‌మౌళి సినిమా తొలిభాగంలో అస‌లైన స్టోరీలోకి ఎంట‌ర్ కావ‌డానికే చాలా టైం తీసుకోవ‌డతో ఫ‌స్ట్ హాప్‌లో చాలా టైం వేస్ట్ అయిపోయింది. తొలిభాగం మొత్తం త‌మ‌న్నా, ప్ర‌భాస్ ఎంట్రీ, త‌మ‌న్నా, ప్ర‌భాస్ మ‌ధ్య రొమాన్స్ సీన్ల‌తోనే స‌రిపెట్టేశాడు. ఇక భ‌ల్లాల‌దేవుడిగా రానా ఎంట్రీ చాలా భీక‌రంగా ఉంటుంది. ఈ సినిమాలో భ‌ల్లాల‌దేవుడిగా స‌రికొత్త రానాను చూస్తాం. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో శివుడు మ‌హిష్మ‌తిలోకి ఎంట‌ర్ కావ‌డం అక్క‌డ త‌న త‌ల్లి దేవ‌సేన‌ను తీసుకువ‌చ్చే సీన్ల వ‌ర‌కు సినిమా ప్లాట్‌గా వెళుతుంది. ప్లాష్‌బ్యాక్‌లో భార్య‌భ‌ర్త‌లైన శివ‌గామి, నాజ‌ర్‌ల‌లో శివ‌గామి ఇద్ద‌రు కుమారుల్లో స‌మ‌ర్థులైన వారికి రాజ్యం ఇవ్వాల‌ని భావిస్తే…నాజ‌ర్ మాత్రం త‌న కుమారుడు భ‌ల్లాల‌దేవుడే రాజు కావాల‌ని అనుకోవ‌డం…చివ‌ర‌కు కాల‌కేయుల‌తో యుద్ధం రావ‌డం…యుద్ధం ముగిసిన వెంట‌నే శివ‌గామి బాహుబిని రాజుగా ప్ర‌క‌టించ‌డంతో సినిమా ముగుస్తుంది.

ఓవ‌రాల్‌గా ఫ‌స్ట్‌హాఫ్‌లో ఎక్క‌వ సాగ‌దీత స‌న్నివేశాల‌తో న‌డిపించిన జ‌క్క‌న్న సెకండాఫ్‌ను రేజ్ చేసినా టైం వేస్ట్ కావ‌డంతో అనుకున్న స్థాయిలో సీన్లు ఎలివేట్ కాలేదు. అయితే చివ‌ర్లో అర‌గంట పాటు వ‌చ్చిన యుద్ధ‌సన్నివేశాలు, ఎత్తులు, ఫ‌స్ట్‌హాఫ్‌లో విజువ‌ల్స్‌, సెట్టింగులపై మాత్రం బాగా దృష్టిసారించారు.

న‌టీన‌టులేంచేశారు…

ప్ర‌భాస్‌: శివుడు క్యారెక్ట‌ర్‌లో ల‌వ‌ర్‌బాయ్‌గా త‌మ‌న్నాతో రొమాన్స్ చేసిన ప్ర‌భాస్‌, ప్లాస్‌బ్లాక్‌లో బాహుబ‌లిగా యుద్ధ‌రంగంలో సూప‌ర్బ్ అనే న‌ట‌న క‌న‌ప‌రిచాడు. శివుడిగా త‌న‌కు జ‌రిగిన అన్యాయం తెలిసిన‌ప్పుడు ప్ర‌భాస్ ప‌లికించిన రౌద్ర‌ర‌సం అద్భుతంగా ఉంది. క‌త్తి, విల్లు ప‌ట్టిచేసిన యాక్ష‌న్ సీన్లు మైమ‌రిపించాయి.

రానా:భ‌ల్లాల‌దేవుడిగా రానా ఎంట్రీయే భ‌యకంరంగా ఉంది. ఓ క్రూర‌మైన రాజు ఎలా ఉంటాడో అన్న ప‌దానికి రానా ఈ సినిమాలో క‌రెక్టుగా స‌రిపోయాడు. త‌న హావ‌భావాలు, భేష‌జంతో బాగా న‌టించాడు. ఇక అటు ప్లాష్‌బ్లాక్‌లోను ఇటు ఫ‌స్ట్‌హాఫ్‌లోను త‌న క‌ళ్ల‌తోనే క్రూర‌త్వాన్ని చాటి చెప్పి సినిమాకు హైలెట్ అయ్యాడు. దేవ‌సేన గురించి అత‌డు చెప్పే డైలాగులు, అత‌డి న‌ట‌న ఒళ్లు గ‌గుర్పొడిచేలా ఉంది.

త‌మ‌న్నా: అవంతిక పాత్ర‌లో చాలా క్యూట్‌గా క‌నిపించింది. ఆమె ప్ర‌భాస్‌తో చేసిన రొమాన్స్ సీన్ల‌లోను ఆమె ఒంటిమీద వ‌స్రాలు ప్ర‌భాస్ ఒలిచేట‌ప్పుడు..రంగురంగుల సీతాకోక‌చిలుక‌లు ఒంటినిండా ఉన్న టైంలో ఆమె ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు..కత్తిప‌ట్టి అటు ప్ర‌భాస్‌తోనే యుద్ధం చేసేట‌ప్పుడు…చ‌క్క‌ని న‌ట‌న క‌న‌పరిచింది. ఈ సినిమాలో ఆమె న‌ట‌న ఆమెలోని కొత్త కోణాన్ని ఆవిష్క‌రించింది.

అనుష్క‌: దేవ‌సేన అనే డీ గ్లామ‌రైజ్ క్యారెక్ట‌ర్‌లో న‌టించిన అనుష్క‌కు ఈ సినిమాలో న‌టించేందుకు పెద్ద‌గా స్కోప్ లేక‌పోయినా జుట్టు విర‌పోసుకుని 25 సంవ‌త్స‌రాల పాటు చెర‌సాల‌లో బందీగా ఉండి…మ‌హిష్మ‌తీ కోసం నా కొడుకు వ‌స్తాడంటూ ఆమె చెప్పై డైలాగులు ఓకే.

ర‌మ్య‌కృష్ణ‌: మ‌హిష్య‌తి రాజ్య శ్రేయ‌స్సు కోసం త‌న సొంత కుమారుడైన భ‌ల్లాల‌దేవుడిని ప‌క్క‌న‌పెట్టి బాహుబ‌లికి రాజ్యం అప్ప‌గించే పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ జీవించేసింది. స‌వతి కొడుకుని సొంత కొడుకుగా పెంచి …తాను న‌దిలో మునిగిపోతూ శివుడుని ర‌క్షించ‌డం…గంభీర‌మైన డైలాగుల‌తో ర‌మ్య‌కృష్ణ న‌ట‌న చాలా బాగుంది.

ఇక మిగిలిన వారిలో సేనాని క‌ట్టప్ప‌గా స‌త్య‌రాజ్‌, యువ‌రాజుగా అడవి శేష్ , పర్షియ రాజు గా సుదీప్, బిజ్జ‌ల‌దేవ‌గా నాజ‌ర్‌, కాల‌కేయ‌గా ప్ర‌భాక‌ర్ త‌దిత‌రులు త‌మ పాత్ర‌ల‌కు చాలా వరకు న్యాయం చేసి సినిమాను రంజింప‌చేశారు.

సాంకేతిక‌నిపుణుల ప్ర‌ద‌ర్శ‌న‌:
సాంకేతిక నిపుణుల్లో స్టోరీ ఇచ్చిన విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ గ‌తంలో మ‌నం ఎన్నో పాత సినిమాల్లో చూసిన రాజులు, యుద్ధాల స్టోరీనే తీసుకున్నా ఆయ‌న దాన్ని స‌రికొత్త‌గా మ‌ల‌చ‌లేక‌పోయాడు. 1960వ ద‌శ‌కం నుంచి రాజుల సినిమాల్లో మ‌నం ఇలాంటి రివేంజ్ స్టోరీల‌ను చూస్తూనే ఉన్నాం. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ పెద్ద‌గా వ‌ర్క్ చేయ‌కుండానే స్టోరీ ఇచ్చేశాడు. ఇక సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం.కీర‌వాణి పాట‌ల‌తో పాటు సినిమాలో ప్ర‌తిసీన్‌కు త‌గిన‌ట్టుగా నేప‌థ్య సంగీతం ఇచ్చారు. కీర‌వాణి ఆర్ ఆర్ సినిమాను ఓ రేంజ్‌లో నిల‌బెట్టింది. ఇంట‌ర్వెల్‌తో పాటు చివ‌ర్లో వ‌చ్చే వార్ సీన్ల‌లో ఆర్ ఆర్ ప్రాణంగా నిలిచింది.

సాబుసిరిల్ ఆర్ట్ వ‌ర్క్ ఎక్స్‌టార్న‌రీగా ఉంది. ఆ సెట్లు చూస్తుంటే ఆహా అనాల్సిందే. సెంథిల్‌కుమార్ సినిమాటోగ్ర‌ఫీ చూస్తుంటే మ‌నం మ‌రో లోకంలో ఉన్నామా అన్న‌ట్టు ఉంది. చూడ‌డానిక రెండు క‌ళ్లు చాల‌వు. పీట‌ర్ హెయిన్స్ ఫైట్లు మామూలుగానే ఉన్నా..వార్ సీన్ల‌లో మాత్రం మెచ్చ‌కుని తీరాల్సిందే. ఓకేసారి వేలాదిగా గుర్రాలు, ఏనుగులు, ర‌థాల‌తో పాటు విల్లంబులు చేత‌బూని యుద్ధాలు చేసేట‌ప్పుడు అత‌డి నైపుణ్యం క‌నిపించింది. ఇక దేవినేని ప్ర‌సాద్‌, శోభుయార్ల‌గ‌డ్డ నిర్మాణ విలువ‌లు..ఆ రీచ్‌నెస్ ప్ర‌తి ఫ్రేములోను క‌నిపించింది.

జ‌క్క‌న్న బాహుబ‌లి డైరెక్ష‌న్ క‌ట్స్‌:
టాలీవుడ్‌లో అప‌జ‌యం లేని డైరెక్ట‌ర్‌గా పేరున్న రాజ‌మౌళి చేసిన ఈ భారీ ప్ర‌య‌త్నం మెచ్చుకోత‌గిన‌దే అయినా కొన్ని చోట్ల త‌డ‌బ‌డ్డాడు. ఓవ‌రాల్‌గా యాక్ష‌న్‌పైనే కాన్‌సంట్రేస‌న్ చేయ‌డంతో ఫ‌స్ట్‌హాఫ్ కాస్త స్లో అయిన‌ట్టు అనిపిస్తుంది. సెకండాప్‌లో వ‌చ్చిన యుద్ధ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌క్క‌న్న ప‌నితీరుకు నిద‌ర్శ‌నంగా నిలిచాయి. అన్ని వేల మందితో ఆ సీన్లు షూట్ చేయ‌డం మామూలు విష‌యం కాదు. మిగిలిన పాత్ర‌లు, సీన్ల ప‌రంగా ఓవ‌రాల్‌గా మెప్పించాడు.

బాహుబ‌లి ఫ్ల‌స్ పాయింట్స్ (+):
సెకండాఫ్‌లో వార్
ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌
సెంథిల్‌కుమార్ సినిమాటోగ్ర‌ఫీ
విజువ‌ల్స్‌
ప్ర‌భాస్‌, త‌మ‌న్నా రొమాన్స్ సీన్లు

బాహుబ‌లి మైస‌స్ పాయింట్లు (-)
స్లో న‌రేష‌న్‌
అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా లేని ఫ‌స్ట్‌హాఫ్‌
సాగ‌దీత స‌న్నివేశాలు
లెస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
మ‌రీ కొత్త‌గా లేని క‌థ‌

ఫైన‌ల్‌గా….
టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే భారీ అంచ‌నాల‌తో..భారీగా రిలీజ్ అయిన బాహ‌బ‌లి సినిమా ప్రేక్ష‌కుల హైఎక్స్‌ఫెక్టేష‌న్స్‌తో పోల్చుకుంటే ఆ అంచ‌నాల‌ను కాస్త త‌క్క‌వుగా అందుకుంద‌నే చెప్పాలి. మ‌న‌కు ఎప్పుడో తెలిసిన రాజులు, రాజ్యాల స్టోరీని రెండు భాగాలుగా తెర‌కెక్కించ‌డంతో తొలి భాగం వ‌ర‌కు పర్వాలేద‌నిపించే స్థాయిలో ముగించాడు. ఆయ‌న గ‌తంలో తీసిన మ‌గ‌ధీర‌, ఈగ సినిమాల‌తో బాహుబ‌లిని పోల్చుకుంటే ఎక్క‌డో కాస్త అసంతృప్తి ఉన్న‌ట్టు అనిపిస్తుంది. స్టోరీ కూడా కొత్త‌గా ఏమీ అనిపించ‌దు. అయితే అస‌లు ప్ర‌భాస్‌, రానా వార్‌ స్టోరీ సెకండ్ పార్ట ఉండడంతో ఆ పార్ట్‌ను జ‌క్క‌న్న ఎలా మ‌లుస్తాడా అన్న‌ది చూడాలి.

బాహుబ‌లి నేటిసినిమా.కామ్ రేటింగ్‌: 3.25