All meadia

 

Saturday, 28 February 2015

హామిలిచ్చి ఏపీ నోట్లో మట్టికొట్టారు;ఆనం

తెలంగాణ వెబ్ న్యూస్;విభజన చట్టంలో ఏపీకి ఎన్నో  హామీలిచ్చిన కేంద్రం బడ్జెట్ లో కొచ్చేసరికి ఏపీ ప్రజల నోట్లో మట్టికొట్టిందని  పీసీసీ ఉపాధ్యక్షుడు ఆనం వివేకానందరెడ్డి విమర్శించారు. బడ్జెట్ లో ఏపీకి తీవ్ర  అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ  పట్టణంలోని మైపాడు గేట్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి మానవహారం  చేపట్టారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో రాష్ట్రానికి సరైన కేటాయింపులు లేకపోవడం బాధాకరమన్నారు. ఏపీని చిన్నచూపు చూస్తున్నారనడానికి ఇది నిదర్శనమన్నారు.

No comments:

Post a Comment