Wednesday, 30 September 2015
దేశంలో వినాయక పూజకు 22వేల కోట్లు.. వృధా...??? అంటూ
Tv9 వాళ్ళు మన కళ్ళు తెరిపించారు
ఇంతకు ఆ 22వేల కోట్లు వృధా ఏ విధముగా జరిగిందో ఎవ్వడైనా చెప్పాగలడా....???
22వేల కోట్లు వినాయక పూజకు కాకుంట పేద ప్రజలకు పెట్టి ఉంటే బాగుండేది.....
ఇంతవరకు బాగానే ఉంది.
ఇంతకు 22వేల కోట్లు వృధా అంటున్నారు కదా ఆ డబ్బు అంత వినాయకుడు తిన్నాడా ...???
లేక కాల్చి బూడిద చేసారా..??
వృధా జరిగింది అని మీరు ఎలా భావిస్తున్నారు ...??
చెప్పగలరా ...??
నా ఆలోచన కి వృధా అన్నది ఒక్క పైసా కూడా జరగలేదు
చివరకు వినాయకుని ఉపయోగించిన మట్టిని కూడా మనం తిరిగి ఉపయోగించ గలుగుతున్నాము
పేద ప్రజల మీద అంత ప్రేమ చూపిస్తున్న వాళ్ళకు ఒక ప్రశ్న....
ఇంతకు ..పేద ప్రజలు అంటే ఎవ్వరు ...???
న్యాయంగా మట్టితో వినాయకుడి విగ్రహాల్ని తయ్యారు చేస్తూ ఆ విగ్రహాలకు అమ్ముకుంటున్న వాళ్ళు పేద ప్రజలు కారా ...??
ఉదయం 3 గంటలకే నిద్రలేచి పూలదండలు కడుతూ
ఆ హారాల్ని అమ్ముకొని న్యాయంగా కడుపు నింపు కుంటున్న ప్రజలు పేదవారు కాదా ..???
రాష్ట్రం కాని రాష్ట్రాలకు వెళ్తున్న పశ్చిమ బెంగాల్ మరియు ఇతర రాష్ట్రాల ప్రజలు, మండపాలు కడుతూ వాళ్ళ భార్య , బిడ్డలకు ధర్మంగా కడుపు నింపు కుంటున్నరు కదా.... వారంతా పేద ప్రజలు కాదా ...???
విగ్రహాలకు రంగులు పూస్తున్న...
ఆ రంగుని తయారు చేస్తున్న ప్రజలు పేద ప్రజలు కాదా ..???
విద్యుత్ పరికరాలతో మండపాన్ని రంగుల హరివిల్లుగా తీర్చి దిద్దే వాళ్ళు పేద ప్రజలు కాదా...???
ప్రతి పూజా మండపాలలో చేస్తున్న అన్నదానంలో .. కుల మతాలకు అతీతంగా భోజనం చేస్తున్న ప్రజలు పేద ప్రజలు కాదా .???
ఇంతకు మీరంతా చింతిస్తున్న పేద ప్రజలు ఎవ్వరు..???
ఒక్క సారి విగ్రహాలు తయారు చేస్తున్న వాళ్ళను అడగండి.... వాళ్ళు చెప్తారు వాళ్ళకు దేవుడు ప్రత్యక్షంగా కాకపోయినా.... పరోక్షంగా వాళ్ళకు ఈ రకముగా దీవెనలు అందిస్తున్నాడు అని ఆనందంగా చెప్తారు ...
పాపం వాళ్ళకు రెక్కాడితే కాని డొక్కాడదు..
ఇక్కడే ఇంకో ప్రశ్నకు ఆస్కారం ఉంది. పూజకు ఖర్చు పెట్టే డబ్బు వాళ్ళందరికీ ఉచ్చితంగా ఇచ్చెయ్యవచ్చు కదా అని ...
ఆలోచించండి, అలా ఉచితంగా తీసుకునే సంస్కారం హిందూ ప్రజలకు లేదు....
ఇంకో మాట వినాయక చవితి పూజలు చేస్తున్న ప్రజలు బాగా బలిసిన వాళ్ళు కాదు...
ఇదిగో మాలాంటి సామాన్య ప్రజలం. అందరం ఒక్కరి నిధుల మీద ఆశ పడకుంట సమిష్టిగా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నం.
మాకు మీలాగా అడ్డగోలుగా నిధులు రావు.అలా వచ్చినా మేము తీసుకోము ..
మాకు మేము కష్టపడి సంపాదించి....
బిరియాని కాకా పోయిన సంతోషంగా గెంజి నీళ్ళు తాగుతం మా కష్టార్జితంతో మాకు తోచిన రీతిలో మా ఆనందం కోసం ప్రాకులాడుతూ పూజలు నిర్వహిస్తున్నం... ఎందుకంటే ఆనందం అన్నది కూరగాయల సంతలో దొరికేది కాదు అది ప్రతి పనిలో భగవంతుని చూడగలుగడం.
ఈ పండుగలో ప్రకృతి సౌందర్యంతో కూడుకున్న నిజమైన ఆనందం దొరకుతుంది.
మా ఆనందం కేవలం మా వరకే కాదు. వినాయక చవితితో లబ్ది పొందుతున్న ప్రతి జీవికి కూడా ఆనందమే ... మేము పేద వారిమే కానీ న్యాయంగా బ్రతికే వాళ్ళం. ఆ దేవాదాయ శాఖకు హిందూ ధర్మ నిధి ప్రతి సంవత్సరం లక్ష కోట్లు నిధి కన్నా ఎక్కువ వస్తుంది.
ఆ డబ్బుతో
మైనారిటీ
దళితులు
ఎస్ సి
ఎస్ టి
బడుగులు
బలహీనులకు, ప్రతి నెల పింఛన్, కోటా బియ్యం, చదువు కోసం నిధులు కేటాయించడం జరుగుతున్నది.
వినాయక చవతి వలన అందరికి మంచే జరిగింది.
ఆ దేవుడి దయవల్ల కొన్ని వేల మంది కడుపు నింపు కున్నారు
విజ్ఞులారా ....
22 వేల కోట్లు వృధా అవ్వలేదు,
ఆ 22 వేల కోట్లు రూపాయలు ఆ గణనాథుడి ద్వారా పేద ప్రజలకు చేరటం జరిగింది.
ఇది నగ్న సత్యం
జై హింద్
Monday, 28 September 2015
Minister KTR PRESS conference
Sent from
తేది-28-09-2015
పత్రికా ప్రకటన
ఈ-పంచాయితీలతో సమగ్ర గ్రామాభివృద్ది, మహిళా సాధికారత సాకారం- పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు
గ్రామస్ధాయి పెట్టుబడిదారులు (VLE'S) ల శిక్షణ కార్యక్రమంలో మంత్రి కె.తారక రామారావు మహిళలతో సంభాషణ
గ్రామాల్లోకి అన్ని పౌరసేవలను ప్రజలకి తీసుకువెళ్లేందుకే ఈ కార్యక్రమం
పల్లె సమగ్ర సేవా కేంద్రాల ద్వార సూమారు 10,000 మందికి మహిళకి ఉపాది
సమాచార, సాంకేతిక పరిజ్ఘానాన్ని మేళవింపుతో శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం గోప్పమార్పుకి నాంది
గ్రామాల్లో ప్రారంభించనున్న సమగ్ర పల్లె సేవ కేంద్రాలను గ్రామాల సంపూర్ణ ఆభివృద్ది మహిళా సాధికారత లక్ష్యంగా ప్రారంభిస్తున్నట్లు పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. మహిళలకి సాధికారత కల్పించేందు కోసమే ఈ సమగ్ర సేవ కేంద్రాల నిర్వహాణను మహిళలకే కట్టపెట్టామన్నారు. మహిళలు ఏ కార్యక్రమం చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారన్న నమ్మకం తమదన్న మంత్రి...ఈ మహిళలు నిర్వహించబోయే ఈ పల్లె సమగ్ర సేవా కేంద్రాలు విజయవంతంగా నడుస్తాయన్నారు. తెలంగాణ పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది సంస్ధ, రాజేంద్రనగర్ లో పల్లె సమగ్ర సేవా కేంద్రాలను నిర్వహించేందుకు ఏంపిక చేసిన గ్రామస్ధాయి పెట్టుబడిదారులు ( VLE'S) ల శిక్షణ కార్యక్రమంలో మంత్రి కె.తారక రామారావు మహిళలతో సంభాషించారు. గ్రామాల్లోకి అన్ని పౌరసేవలను ప్రజలకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమం ఉపయోగయోగపడుతుందన్నారు. నాలుగు లక్షల పైచిలుకు స్వయం సహయక సంఘాలల్లోని మహిళలు సూమూరు 5వేల కోట్ల రూపాయాల రుణాలను తిరిగి చెల్లిస్తూ అర్ధిక క్రమశిక్షణకి మారుపేరుగా నిలుస్తున్నారని ప్రశంసిచారు. పల్లె సమగ్ర సేవా కేంద్రాల నిర్వహణ ద్వార సూమారు 10,000 మహిళకి మందికి ఉపాది లభిస్తుందన్నారు. మహిళలు ఈ కేంద్రాల నిర్వహణ ద్వారా గౌరవ ప్రదమైన స్ధానం లభిస్తుందన్న అశాభావం వ్యక్తం చేశారు. ఈ కేంద్రాలను నిర్వహించే మహిళలు...తమకున్న నైపుణ్యాలను ఉపయోగించుకుని మరిన్ని అదాయ వనరులు పెంచుకోవాలన్నదే తమ అభిమతమన్న మంత్రి...అందుకోసమే వీరిని గ్రామస్ధాయి పెట్టుబడిదారులంటున్నమన్నారు.
ఈ కార్యక్రమం పూర్తి స్ధాయిలో నిర్వహణలోకి వచ్చిన తర్వతా ఈ పంచాయితీ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఓక అదర్శంగా నిలుస్తుందన్నారు... సాంకేతికతను ప్రభుత్వ పాలన విధానాలతో అనుసంధాంన చేసినప్పుడు అవినీతి తగ్గుతుందని...ప్రజలకి ప్రతిఫలాలు వందశాతం అందుతాయన్న మంత్రి....ఈ పంచాయితీల ఏర్పాటుతో ప్రభుత్వ పాలనా లక్ష్యాలు సంపూర్ణంగా నెరవేరుతాయని మంత్రి తెలిపారు.... సమాచారాన్ని సాంకేతిక పరిజ్ఘానాన్ని కలిపి తాము శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం గోప్పమార్పు తీసుకువస్తుందని...ఇందులో భాగస్వాములవుతున్న పత్రి వియల్ ఈ VLE లను అభినందించారు. ఈ పల్లె సమగ్ర సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వా పథకాల నగదు పంపీణీని అనుసంధానం చేస్తామన్నారు. ముఖ్యంగా ఉపాధి హమీ పథకం చెల్లింపులు, పించన్ల చెల్లింపులు ఈ కేంద్రాలకి అనుసంధానం చేస్తామన్నారు.
ఈ సమగ్ర సేవా కేంద్రాల నిర్వహణకి ఏంపిన చేసిన మహిళలతో మంత్రి సంభాషించారు. ఏ ఏ అంశాల మీద శిక్షణ ఇచ్చారు.... మెత్తం ఈ పల్లె సమగ్ర సేవ కేంద్రాల ఏర్పాటు పట్ల గ్రామాల్లో ఏలాంటి స్పందన ఉంది....మెత్తం కార్యక్రమ నిర్వహణ ద్వార ఏలాంటి ప్రయోజనాలుంటాయంటూ వారి పలు అంశాల మీద అడిగి తెలుసుకున్నారు. నల్గోండ జిల్లాకి చెందిన నజిమా... తనకి లభించిన ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని తెలిపిన... ప్రస్తుతం బ్యాంకు బిజినెస్ కరెస్పాండెట్ గా సూమారు 4వేల రూపాయాలు నెలకి సంపాదిస్తున్ననని తెలిపింది. ప్రభుత్వ పధకాల నగదు చెల్లింపులను అనుసంధానం చేసిన తర్వతా అదాయం మరింత పెరుగుతుందన్నారు.
కరీంనగర్ జిల్లాకి చెందిన రజిత మంత్రికి ప్రస్తుతం తాము అందిస్తున్నసేవలను మంత్రికి వివరించారు. తాను సూమారు నెలకి పదివేలు అదాయం పొందుతున్నట్లు....చాల మంది వృద్దపించన్ లబ్దిదారులు...తాను అందిస్తున్న సేవలను అభినందిస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో పంచాయితీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్, కమీషనర్ అనితా రాంచంద్రన్, ఐటి శాఖ సెక్రటరీ జయేష్ రంజన్, స్ర్తీనిధి యండి విద్యాసాగర్ రెడ్డి, ఇతర ఉన్నాతాదికారులున్నారు.
Wednesday, 9 September 2015
60 ఏళ్లకు విద్యుత్ ఉద్యోగుల రిటైర్మెంట్
విద్యుత్ సంస్థల్లో
పనిచేస్తున్న ఉద్యోగుల రిటైర్‌మెంటు వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ
ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి
పీవీ రమేష్ చాంబర్‌లో ఇంధన శాఖ బోర్డు సమావేశం మంగళవారం జరిగింది. జెన్‌కో
ఎండీ, ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ హాజరైన ఈ సమావేశంలో రిటైర్‌మెంటు
వయస్సుతోపాటు పలు నిర్ణయాలు తీసుకున్నారు.
స్కాలర్‌షిప్ దరఖాస్తులకు గడువు 20 వరకు పొడిగింపు
2014-15 సంవత్సరంలో
స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు పొందని విద్యార్థులకు ప్రభుత్వం మరో
అవకాశాన్ని కల్పించింది. హైదరాబాద్ జిల్లాలోని పలు కళాశాలల్లో చదువుతున్న
షెడ్యూల్డు కూలల విద్యార్థులు, వికలాంగ విద్యార్థులు 2014-15 సంవత్సరంలో
ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోని వారికి సెప్టెంబర్ 20 వరకు గడువు
పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎస్‌సీడీ ఉపసంచాలకులు
డి.హన్మంతునాయక్ తెలిపారు. 2014-15 సంవత్సరంలో ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ
విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు బయోమెట్రిక్ అవసరం లేదని,
దరఖాస్తులు సంబంధిత జిల్లా సంక్షేమ అధికారికి అందజేయాలని తెలిపారు. అన్ని
కళాశాలల్లో ప్రిన్సిపాల్స్ విద్యార్థుల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు
చేయించాలన్నారు. ఇప్పటికీ పలు కళాశాలల ప్రిన్సిపాల్స్ దరఖాస్తులను
పెండింగ్‌లో పెట్టారని, అలాంటి వారందరూ వెంటనే సంబంధిత జిల్లా సంక్షేమ శాఖ
అధికారులకు ఆన్‌లైన్‌లో పంపించాలని సూచించారు. అలా పంపించని కళాశాలలపై తగిన
చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జగన్ దీక్ష 26కి వాయిదా : జ్యోతుల నెహ్రూ
ప్రత్యేక హోదా కోరుతూ ఈ
నెల 15న గుంటూరులో ప్రతిపక్ష నేత జగన్ తలపెట్టిన దీక్ష వినాయక చవితి
కారణంగా ఈ నెల 26కి వాయిదా వేశారు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ నేత జ్యోతుల
నెహ్రూ హైదరాబాద్‌లో మీడియాకు తెలిపారు. నదుల అనుసంధానానికి వైఎస్ చర్యలు
చేపడితే..చంద్రబాబు నేనే చేశానంటూ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దేవినేని
ఉమ, చింతమనేని పూజలు ఎందుకో చెప్పాలన్నారు. పట్టిసీమకు ఎప్పటికీ వైసీపీ
వ్యతిరేకమేనని జ్యోతుల నెహ్రూ మరోసారి స్పష్టం చేశారు.
మొదలైంది ఆట కాదు వేట : రేవంత్‌రెడ్డి
బంగారు తెలంగాణ చేస్తాడని
కేసీఆర్‌ను గెలిపిస్తే.. తాగుబోతుల తెలంగాణ తెచ్చాడని టీడీపీ ముఖ్యనేత
,కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎల్బీనగర్‌కు చెందిన
టీఆర్‌ఎస్ , కాంగ్రెస్ పార్టీల నేతలు రేవంత్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో
చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై నిప్పులు
చెరిగారు. కేసీఆర్ నియంతృత్వ విధానాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం
చేస్తున్నాడని విమర్శించారు. తెలుగు ప్రజలందరూ గర్వంగా చెప్పుకునే మహానగరం
హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీనేనని ఆయన చెప్పారు.
సింహం సింగిల్‌గా హైదరాబాద్ వస్తుంటే కేసీఆర్ భయపడి చైనాకు వెళ్లాడని ఆయన
ఎద్దేవాచేశారు. ‘మొదలైంది ఆట కాదని..వేట’ అని రేవంత్ అన్నారు.
మద్యం లేక పలువురికి అస్వస్థత
మద్యం మహమ్మారితో
కుటుంబాలు నష్టపోతున్నాయని భైంసా మండలంలోని మూడు గ్రామాల ప్రజలు మద్య నిషే
ధం ప్రకటించారు. గ్రామస్థులందరి సమన్వయంతో, యువజన సంఘాల తోడ్పాటుతో మూడు
గ్రామ పంచాయతీల వీడీసీలు మద్య నిషేధాన్ని విధించేందుకు తీర్మానించి
అమలుపరుస్తున్నారు. మాటేగాం గ్రామ పం చాయతీ పరిధిలో స్వాతంత్య్ర దినోత్సవం
నుంచి, కుంసర గ్రామ పరిధిలో రాఖీ పౌ ర్ణమి నుంచి, కామోల్ గ్రామంలో శ్రీ
కృష్ణుని జయంతి నుంచి మద్య నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
కొంత కాలంగా గ్రామాల్లో మద్యం విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కల్తీ కల్లు విక్రయాలు జోరుగా జరుగుతున్నా యి. దీంతో పగలు, రాత్రి అనే తేడా లేకుం డా మద్యం సేవించి గొడవలు జరుగుతున్నాయి. అంతే కాకుండా అతిగా మద్యం తాగి పలువురు అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ప్రశాంతత కరువైంది. మద్యం మహమ్మారితో ఏర్పడుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ముందుగా మాటేగాం గ్రామస్థులు అడుగువేశారు. అనంతరం ఇదే తరహాలో కుంసర, కామోల్ గ్రామస్థులు మద్యంపై సమరం ప్రారంభించారు. ఈ క్రమంలో మూడు గ్రామాల యువజనులు కీలక పాత్ర పోషించాయి. గ్రామంలోని అన్ని వర్గాల వారు సంపూర్ణ మద్దతు తెలుపడంతో మాటేగాం, కుంసర, కామోల్ గ్రామాల వీడీసీలు తీర్మానం చేసి మద్య ని షేధాన్ని తమ తమ గ్రామాల్లో విధించారు. ఒకే సారి మద్యం మానివేయడంతో కొంత మంది మందుబాబులు అస్వస్థత చెందుతున్నారు. అయినప్పటికీ వీడీసీలు మొక్కవోని దీక్షతో మద్య నిషేధాన్ని కొనసాగిస్తున్నారు.
కొంత కాలంగా గ్రామాల్లో మద్యం విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కల్తీ కల్లు విక్రయాలు జోరుగా జరుగుతున్నా యి. దీంతో పగలు, రాత్రి అనే తేడా లేకుం డా మద్యం సేవించి గొడవలు జరుగుతున్నాయి. అంతే కాకుండా అతిగా మద్యం తాగి పలువురు అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ప్రశాంతత కరువైంది. మద్యం మహమ్మారితో ఏర్పడుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ముందుగా మాటేగాం గ్రామస్థులు అడుగువేశారు. అనంతరం ఇదే తరహాలో కుంసర, కామోల్ గ్రామస్థులు మద్యంపై సమరం ప్రారంభించారు. ఈ క్రమంలో మూడు గ్రామాల యువజనులు కీలక పాత్ర పోషించాయి. గ్రామంలోని అన్ని వర్గాల వారు సంపూర్ణ మద్దతు తెలుపడంతో మాటేగాం, కుంసర, కామోల్ గ్రామాల వీడీసీలు తీర్మానం చేసి మద్య ని షేధాన్ని తమ తమ గ్రామాల్లో విధించారు. ఒకే సారి మద్యం మానివేయడంతో కొంత మంది మందుబాబులు అస్వస్థత చెందుతున్నారు. అయినప్పటికీ వీడీసీలు మొక్కవోని దీక్షతో మద్య నిషేధాన్ని కొనసాగిస్తున్నారు.
కేన్సర్‌ను గుర్తించేందుకు ఆన్‌లైన్ యాప్
కణాలలోని
జన్యుపరమైన చిహ్నాలను పోల్చి చూడడం ద్వారా కేన్సర్‌ను గుర్తించే ఆన్‌లైన్
అప్లికేషన్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. చూడడానికి ఒకేలా ఉన్న
కణాలలోనూ విశ్వజన్యురాశి వేర్వేరుగా ఉంటుందని, ఓ చిన్న కణితి నుంచి
సేకరించిన కేన్సర్ కణాలు కూడా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయని చెప్పారు.
అయితే జన్యుపరమైన మార్పులతో ఇవి కణాలలో విపరీతమైన వేగంతో వ్యాపిస్తాయని
వివరించారు. ఈ రకమైన మార్పులకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారమిచ్చే
వ్యవస్థనే కాపీ నంబర్ వేరియోషన్స్(సీఎన్‌వీ)గా వ్యవహరిస్తున్నట్లు
తెలిపారు. దీనికి సంబంధించిన అధ్యయనం కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న
వ్యవస్థలు అంత విశ్వసనీయమైనవి కావని కోల్డ్ స్ర్పింగ్ హార్బర్ లేబరేటరీ
అసోసియేట్ ప్రొఫెసర్ మైకెల్ స్కాట్జ్ అభిప్రాయపడ్డారు.
ఉద్యోగులకు 6 శాతం డీఏ పెంపుకు కేంద్రం ఆమోదం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువుభత్యాన్ని 6 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం
తీసుకుంది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం
తీసుకున్నారు. అలాగే బంగారం బాండ్ల పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
తెలిపింది. 5, 10, 50, 100 గ్రాముల లెక్కన బాండ్ల జారీకి నిర్ణయం
తీసుకుంది. బంగారం స్థానంలో ఆర్‌బీఐ బాండ్లను ఇవ్వనుంది.
ఉద్యోగులకు కరువుభత్యం ప్రస్తుతం 113 శాతం కాగా, పెంపునకు ఆమోదముద్ర
పడటంతో119 శాతానికి చేరుతుంది. దీనివల్ల దేశంలోని కోటి మందికిపైగా
ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది. ఈ ఏడాది ఏప్రి ల్‌లో 107 శాతంగా
ఉన్న కరువుభత్యాన్ని 6 శాతం పెంచిన ప్రభుత్వం, దాన్ని జనవరి నుంచి
అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
మూలవేతనం
ప్రాతిపదికగా లెక్కించే కరువు భత్యం తాజా పెంపుపై కేబినెట్ ఆమోదముద్ర
వేయడంతో ఈ ఏడా ది జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది. నిరుడు జూలై 1 నుంచి ఈ
ఏడాది జూన్ 30 వరకుగల 12 నెలల పారిశ్రామిక కార్మిక-వినియోగదారు ధరల సూచీ
సగటు ఆధారంగా ఈ పెంపును నిర్ణయిస్తారు.
Saturday, 5 September 2015
ఆస్తితగాదాలే షీనాబోరా హత్యకు కారణమంటున్న పోలీసులు
షీనాబోరా హత్య కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ హత్యకు ప్రేమ
వ్యవహారమే కారణమని ఇప్పటి వరకు భావించారు. అయితే ఆస్తి తగాదాల వల్లే షీనాను
తల్లి ఇంద్రాణి హత్య చేసిందని పోలీసులు చెబుతున్నారు. ఇంద్రాణి ముఖర్జీకి
డబ్బు పిచ్చి ఉందని తేలింది. ఇంద్రాణి రహస్య బ్యాంకు ఖాతాలు నిర్వహించిందని
తెలుసుకుని భర్త, మీడియా ప్రముఖుడు పీటర్ ముఖర్జీ బిత్తరపోయారు. షీనాబోరా
హత్య బయటపడ్డాక ఇంద్రాణి దూరంగా ఉండాలని పీటర్ భావిస్తున్నారు.
త్వరలో 12 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ : ఏపీ డీజీపీ
త్వరలో 12 వేల
కానిస్టేబుల్ పోస్టుల భర్తీ జరుగుతుందని ఏపీ డీజీపీ రాముడు తెలిపారు.
హోంగార్డుల వేతనాలు కూడా పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ
రవాణాను అడ్డుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగానే ఉన్నాయని
డీజీపీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు మావోయిస్ట్ ల సమస్యలేదని డీజీపీ
తెలిపారు.
బీడీఎస్ పరీక్ష ఫలితాలు విడుదల
ఎన్టీఆర్
హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జూన్, జూలై నెలలో జరిగిన బీడీఎస్
మూడో సంవత్సరం పరీక్ష ఫలితాలను వర్సిటీ అధికారులు శుక్రవారం విడుదల చేశారు.
తెలంగాణలో నియంత పాలన సాగుతోంది :ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
తెలంగాణలో నియంత పాలన
సాగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన
విలేకరులతో మాట్లాడుతూ... మహబూబ్‌నగర్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు
కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై చేయిచేసుకున్న ఘటనతో రౌడీల పాలనకు
తెరదీశారన్నారు. అలాగే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతుల ఆత్మహత్యలు
జరుగుతున్నాయని, రైతులకు రుణమాఫీ అమలు జరగడం లేదన్నారు. బ్యాంకర్లు వడ్డీలు
వసూలు చేస్తూనే ఉన్నారని, వ్యవసాయశాఖా మంత్రి పంచె కట్టినంత మాత్రాన రైతు
కాలేరని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.
Thursday, 3 September 2015
పేదలను భయపెడుతున్న మంత్రి తలసాని
రాణీగంజ్ కాలనీ
కస్తూర్బానగర్‌లోని స్లమ్ ఏరియా జీనావాలా కాలనీ కాంపౌండ్ స్థలంపై
కన్నేసిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అక్కడ నివసిస్తున్న పేదలను
భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి మర్రి శశిధరరెడ్డి ఆరోపించారు.
పట్టాలున్న పేద కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించేందుకు కుట్ర
జరగుతోందన్నారు. బస్తీవాసులతో కలిసి కలెక్టర్ రాహుల్ బొజ్జా, నగర పోలీస్
కమిషనర్ ఎం. మహేందర్‌రెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు. 1998లో
3(1), 3(2) ద్వారా నోటిఫికేషన్ చేయించి కుటుంబాలకు పొజిషన్ పట్టాలు
ఇచ్చినట్టు తెలిపారు. కాలనీలో ఇళ్లు నిర్మిస్తామని మాట ఇచ్చిన తలసాని ఆ
తర్వాత మాట మార్చారని అన్నారు. కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి తమ
రక్షణకు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను వారు కోరారు.
14 వరకూ ఎన్‌టీఎస్‌ఈ దరఖాస్తు
నేషనల్
టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్(ఎన్‌టీఎస్‌ఈ) మొదటి స్థాయి పరీక్షకు
తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు సెప్టెంబర్ 14లోగా బ్యాంకులో రూ.100
చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం బుధవారం
ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందిన పాఠశాలల విద్యార్థులతో పాటు
సీబీఎ్‌సఈ, ఈసీఎ్‌సఈ గుర్తింపు పొందిన పాఠశాలల విద్యార్థులు కూడా దరఖాస్తు
చేసుకోవచ్చని డైరెక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. నవంబర్ 8న పరీక్షను
నిర్వహించనున్నారు.
ఆర్టీసీ బస్సులో రాజుకున్న మంటలు
సికింద్రాబాద్‌లోని
ప్యాట్నీ దగ్గర ఓ ఆర్టీసీ బస్సులోనుంచి మంటలు వచ్చాయి. బస్సులోనుంచి పొగలు
వచ్చి పాక్షికంగా కాలిపోయింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు బస్సు
కిందకు దిగి పరుగులు తీశారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్
పోలీసులు స్తంభించిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
8 నుంచి డీసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్
డీసెట్-2015లో అర్హత
సాధించిన విద్యార్థులకు ఈనెల 8 నుంచి 11 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్
నిర్వహించనున్నట్లు డీ సెట్ చైర్మన్ టి.చిరంజీవులు ప్రకటించారు. 45పై
మార్కులు వచ్చినవారికి 8న, 40-44 మార్కులు వచ్చిన వారికి 9న, 35-39 వచ్చిన
వారికి 10న, 35 కంటే తక్కువ వచ్చిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 11న
సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామన్నారు.
పనిమంతులకు పరీక్షలు
బడి
పిల్లలకే కాదు.. ఇకపై ఎమ్మెల్యేలకు నెలవారీ, లేదా మూడు మాసాలకు ఒకసారి అసలు
సిసలు పరీక్ష తప్పేటట్టు లేదు. ఎమ్మెల్యేల వ్యక్తిగత పనితీరును సర్వే
రూపంలో సేకరించి మైనస్ మార్కులను తగ్గించుకునే క్రమంలో తెలుగుదేశం
సరికొత్త ప్రయోగం చేస్తోంది. ఇంతకుముందే నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే
పనితీరును అంచనా కట్టినప్పుడు రాష్ట్రస్థాయిలోనే మన జిల్లాకు చెందిన
ఎమ్మెల్యేలు తొలి ఆరు ర్యాం కులు దక్కించుకున్నారు. సహజంగానే ఇది మిగతా
జిల్లాలపై ప్రభావం చూపింది. గోదా వరి జిల్లాలకంటే మేం తక్కువా అనే రీతిలో
మిగతా జిల్లాల్లో ఎమ్మెల్యేల మధ్య పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఇకముందు
విడతల వారీగా సర్వేలు కొనసాగబోతున్నాయి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల
వ్యక్తిగత పనితీరు, ప్రభుత్వ పథకాల అమలు, సరికొత్త విధానాలు, సత్వర
ప్రతిస్పందన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలోనే
జిల్లాలో ఎమ్మెల్యేలు ఇప్పటికీ తమ పదవి ఒక హోదాగా కాకుండా ఒక బాధ్యతగా
నిత్యం ఏదొక వినూత్న విధానాన్ని నియోజకవర్గాల్లో ప్రవేశపెట్టేందుకు పోటీ
పడుతున్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే వంద రోజుల కార్యక్రమాన్ని ప్రకటించి ఈ
స్వల్ప వ్యవధిలోనే నేరుగా ఇంటింటికి మరుగుదొడ్డి, సంపూర్ణ పారిశుధ్యానికి
తొలి అడుగు వేశారు.
మాస్కో ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం
రష్యాలోని మాస్కో
విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో పలు విమానాల రాకపోకలు
తీవ్ర అంతరాయం ఏర్పడింది. అగ్నిప్రమాదం వల్ల దాదాపు 60 విమానాలు ఆలస్యంగా
నడుస్తున్నాయి.
Wednesday, 2 September 2015
నేడు రవాణా బంద్
కేంద్ర ప్రభుత్వం
ప్రతిపాదించిన జాతీయ రహదారి భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం దేశ
వ్యాప్త బంద్‌కు ఆటో యూనియన్‌లు పిలుపునిచ్చాయి. గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ
బస్సులతోపాటు ఆటోలు, క్యాబ్‌లు, ప్రైవేటు బస్సులు, లారీలు
నిలిచిపోనున్నాయి. ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు బంద్‌కు
మద్దతుగా విధులకు వెళ్లడం లేదు. గ్రేటర్ పరిధిలో 3500 ఆర్టీసీ బస్సులు,
1.30 లక్షలకు పైగా ఉన్న ఆటో రిక్షాలు నిలిచిపోనున్నాయి. కార్మిక సంఘాలు
ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించే సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ హైదరాబాద్,
సికింద్రాబాద్, రంగారెడ్డి రీజియన్‌లకు చెందిన బస్సులు దాదాపుగా
నిలిచిపోనున్నాయి. సమ్మెకు ఆర్టీసీ టీఎంయూ, ఎన్‌ఎంయూ, ఈయూలు ఇప్పటికే
మద్దతు తెలపడంతోపాటు కార్మికులు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చాయి.
బుధవారం తెల్లవారు జామునుంచే సిటీ బస్సులు, జిల్లాలకు వెళ్లాల్సిన బస్సులు
డిపోలకే పరిమితం కానున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్‌లకు
చెందిన సిటీ బస్సులతోపాటు రంగారెడ్డి రీజియన్‌కు చెందిన సుమారు ఆరువందల
జిల్లా బస్సులు నిలిచిపోతాయని తెలిపారు.
బల్బులో ఉల్లి ఘాటు
సమాజానికి చక్కటి
సందేశాల్ని తన కళారూపాలు ద్వారా సృజనాత్మకంగా అందిస్తున్న సూక్ష్మ
శిల్పకళాకారుడు గంధవళ్ల ఉమాశంకర్ తాజాగా ఉల్లిపై కళారూపం తయారు చేశారు.
మధ్య తరగతి కుటుంబాలు ఉల్లిపాయల కోసం పడుతున్న ఆవేదనను దీనిద్వారా
ప్రభుత్వాలకు తెలియజేశారు. సుద్ధతో ఉల్లిపాయ నమూనా, ఉల్లిరేటుకు
తల్లడిల్లుతున్న సామాన్య పౌరుడిని బల్బులో ఇమిడ్చి తన కళా ప్రతిభను
ప్రదర్శించారు. త్వరలో ఉల్లి రేటు సామాన్యుడికి అందుబాటులోకి రావాలని ఈ
శిల్పం ద్వారా ఆయన ఆకాంక్షించారు.
నీటి నాణ్యతా పరీక్షలు ఇలా
దాహం వేస్తుందమ్మా
కాసిన్ని మంచినీళ్లిస్తావా..గతంలో ఎవరింటికి వెళ్లినా మంచినీరు అడిగి మరీ
తాగేవారు.అటువంటిది నేడు మంచినీరు తాగాలంటేనే భయపడిపోతున్నారు. రాను రాను
పరిస్థితి ఎంతలా మారిపోయిందంటే..ఆఫీసుకెళ్లినా..బంధువుల
ఇంటికెళ్లినా..లేదంటే మార్కెట్‌కు వెళ్లినా ఒక మంచినీటి బాటిల్ కూడా
ఉండాల్సిందే. ఎందుకంటే సర్వ రోగాలకు మంచినీరే కారణమని తేల్చేశారు..దీంతో
ప్రతీ ఒక్కరికీ మంచినీటిపై శ్రద్ధ పెరిగిపోయింది. సురక్షిత మంచినీటికి నానా
తంటాలు పడుతున్నారు..దీనిలో భాగంగానే ప్రభుత్వం ఎన్‌టీఆర్ సుజల స్రవంతి
వాటర్ పథకాలను ఏర్పాటు చేసింది.ఆ పథకాల ద్వారా అందించే నీరైనా
సురక్షితమేనా అంటే కాస్త ఆలోచించాల్సిందే. అందుకే అవకాశం ఉన్న వాళ్ళు
వాటర్ ఫ్యూరిఫైర్స్ కొనుగోలు చేసుకుని సురక్షిత నీటిని సేవిస్తుంటే..
అవకాశం లేనివాళ్ళు దేవుడే దిక్కంటూ దొరికిన నీటినే సేవించి కాలం
వెళ్లదీస్తున్నారు.అసలు మనం తాగుతున్న నీరు సురక్షితమా కాదా తెలుసుకోవాలంటే
ఎలా..దానికి అవకాశం ఉంది..మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే.మీరు తాగే
మంచినీటిని భీమవరంలో ఇటీవల ఏర్పాటు చేసిన మంచినీటి పరీక్షా కేంద్రానికి
తీసుకెళితే చాలు వాళ్ళు పరీక్షించి ఇస్తారు.మీ నీరు సురక్షితమా కాదా అనేది
తేల్చేస్తారు..అప్పుడు మీ నీరు ముంచేదా..లేల్చేదా తేలిపోతుంది..ప్రతీ
ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధులు ఈ పరీక్షలు చేయిస్తే ప్రజలకు సురక్షిత
నీటిని అందించవచ్చు..రోగాలకు చెక్ చెప్పేయవచ్చు.
వైఎస్ విగ్రహానికి కాంగ్రెస్ నేతల నివాళి
మాజీ ముఖ్యమంత్రి వైఎస్
వర్ధంతి సందర్భంగా పంజాగుట్టలోని వైస్ విగ్రహానికి కాంగ్రెస్ నేతలు
రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రారావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దానం
నాగేందర్‌లు పూలమాలలు వేశారు. అనంతరం గాంధీభవన్‌లో వైఎస్ చిత్రపటానికి
పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆడపిల్లల ప్రాణాలంటే టీడీపీకి విలువ లేదా?: రోజా
ఏపీ
అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష సభ్యురాలు రోజా
మాట్లాడుతూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య
చేసుకున్న రిషితేశ్వరి మృతికి టీడీపీయే కారణమని ఆరోపించారు. టీడీపీ
అధికారంలోకి వచ్చాకే మహిళలపై దాడులు పెరిగాయని రోజా అన్నారు. ఆత్మహత్యకు
కారణమైన ప్రిన్సిపాల్‌కు టీడీపీ కొమ్ముకాస్తుందని ఆరోపించారు. ఆడపిల్లల
ప్రాణాలంటే తెలుగుదేశం ప్రభుత్వానికి విలువ లేదా అని రోజా ప్రశ్నించారు.
రిషితేశ్వరి ఆత్మహత్యకు కారణమైన వారందరిపై చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్
చేశారు.
కేసీఆర్ హైదరాబాద్‌ను దుర్భర నగరంగా మారుస్తున్నారు
హైదరాబాద్ నగరంలో రోడ్ల
పరిస్థితి నరకంగా మారిందని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేస్తానంటున్న కేసీఆర్ దుర్భర నగరంగా
మారుస్తున్నారని ఆయన విమర్శించారు. గ్రేటర్ పరిధిలో ఒక్క గుంత చూపిస్తే
వెయ్యి రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని... కాని ఒక్క రోడ్డు
బాగున్నట్లు చూపిస్తే తాను రూ.లక్ష ఇస్తామని కిషన్‌రెడ్డి ప్రకటించారు.
గతంలో నెంబర్‌వన్ సిటీగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు దేశంలో 272 స్థానానికి
వచ్చిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు.
రోడ్డెక్కని బస్సులు...ప్రయాణికుల అవస్థలు
సార్వత్రిక సమ్మె
ప్రభావంతో రెండు తెలుగు రాష్ర్టాల్లోని పలు జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు
రోడ్డెక్కలేదు. పలు జిల్లాల్లో కార్మికసంఘాల నేతలు ర్యాలీలు జరిపారు.
నల్గొండ జిల్లాలో సమ్మె ప్రభావంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో
రవాణా వ్యవస్థ స్తంభించింది. భువనగిరి పారిశ్రామికవాడలోనూ బంద్
కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు ఆందోళన
చేశారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ఆరు
డిపోల్లో 600 బస్సులు నిలిచిపోయాయి. సింగరేణి కార్మికులు సైతం సమ్మెలో
పాల్గొనడంతో బొగ్గు ఉత్పత్తి నిలచిపోయింది. మెదక్ జిల్లాలో వామపక్షాల
కార్యకర్తలు ఆందోళన చేపట్టాయి. ఆర్టీసీబస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని పది భూగర్భ గనులు, నాలుగు ఓసీపీల్లో
బొగ్గు ఉత్పత్తి నిలచిపోయింది. సిద్దిపేట ఆర్టీసీ డిపో ఎదుట సీఐటీయూ
నాయకులు బైఠాయించారు. చిత్తూరు జిల్లాలోనూ ఆర్టీసీబస్సుల రాకపోకలు
నిలచిపోయాయి. వరంగల్ జిల్లాలో 9 ఆర్టీసీ డిపోల్లో వెయ్యి బస్సులు
ఆగిపోయాయి.
Tuesday, 1 September 2015
21 నుంచి మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాలు
సామ్రాజ్యవాదుల అండతో
పాలకవర్గాలు.. మావోయిస్టు పార్టీని అణచివేసే ప్రయత్నం చేస్తున్నాయని..
మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది. మహిళలపై బలగాల క్రూర ప్రవర్తన..
సాధారణ పౌరులపై పోలీసులు వేధింపులను నిరసిస్తూ.. సెప్టెంబర్ 21 నుంచి 27
వరకు పార్టీ 11వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది.
కోస్తా, తెలంగాణల్లో వర్షాలు
ఒడిసానుంచి కోస్తా మీదుగా
తమిళనాడు వరకు కొనసాగుతున్న అల్పపీడనద్రోణి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా
మారాయి. దీంతో కోస్తా, తెలంగాణల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. సోమవారం
ఉదయం వరకు పాలకుర్తి, మహబూబాబాద్‌లలో ఎనిమిది, వీరఘట్టంలో ఏడు,
నాగిరెడ్డిపేట, మెదక్, ఎల్లారెడ్డిల్లో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం
నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, తెలంగాణ, సీమల్లో
అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది.
హోదా తెస్తానని జగన్ హామీ ఇస్తే...ఎంపీలం రాజీనామా చేస్తాం: జేసీ
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక
హోదా తీసుకువస్తామని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి హామీ ఇస్తే పది
మంది ఎంపీలం రాజీనామా చేస్తామని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సవాల్
చేసారు. మంగళవారం అసెంబ్లీలో ఏపీకి ప్రత్యేక హోదాపై జగన్ చేసిన వ్యాఖ్యాలపై
స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి అసెంబ్లీ లాబీల్లో చిట్‌చాట్‌గా
మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మా రాజీనామా తర్వాత కూడా జగన్ ప్రత్యేకహోదా తీసుకు రాకపోతే..ఏకగ్రీవంగా మమ్మల్ని లోక్‌సభకు పంపుతారా? అని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రమంత్రులు కాదు.. సీఎం రాజీనామా చేసినా ఏపీకి ప్రత్యేక హోదా రాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాకపోతే బీహార్ రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్‌కు మంచి ప్యాకేజీ వస్తుందని, ఆర్థికంగా ఎక్కువ లాభం చేకూరుతుందని జేసీ దివాకర్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
మా రాజీనామా తర్వాత కూడా జగన్ ప్రత్యేకహోదా తీసుకు రాకపోతే..ఏకగ్రీవంగా మమ్మల్ని లోక్‌సభకు పంపుతారా? అని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రమంత్రులు కాదు.. సీఎం రాజీనామా చేసినా ఏపీకి ప్రత్యేక హోదా రాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాకపోతే బీహార్ రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్‌కు మంచి ప్యాకేజీ వస్తుందని, ఆర్థికంగా ఎక్కువ లాభం చేకూరుతుందని జేసీ దివాకర్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
రేపు అర్ధరాత్రి నుంచి ఒక రోజు ఆటోల బంద్
ఢిల్లీ మాదిరిగా
హైదరాబాద్‌లో కూడా డీజీల్‌తో నడుస్తున్న ఉబెర్, ఓలా క్యాబ్స్‌లను వెంటనే
నిషేధించాలని, ఆటోలపై నో ఎంట్రీ ఎత్తివేయాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ
కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం
అర్ధరాత్రి నుంచి ఒక రోజు ఆటోలు బంద్ చేస్తామని అన్నారు. అలాగే
సెప్టెంబర్ 2న చార్మినార్ వద్ద ఉదయం 11 గంటలకు ఆటోడ్రైవర్ల ఽనిరసన ధర్నా
కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సోమవారం
హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ
ఆటోడ్రైవర్స్ జేఏసీ నాయకులు జె.రవీందర్, మిర్జా రఫతుల్లా బేగ్, మహ్మద్
ఆజీముద్దీన్, ఫారుఖ్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. ఆటోలు పర్యావరణ
కాలుష్యానికి కారణమవుతున్నాయని, ఆటోలు వెదజల్లే కాలుష్యం వల్ల
చార్మినార్‌కే ప్రమాదం ఏర్పడిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వితండవాదం
చేయడం పట్ల ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు.
కరీంనగర్ : ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ
పెద్దపల్లి డీఎల్‌పీవో వెంకటయ్య ఘరానా మోసానికి పాల్పడ్డాడు. నిరుద్యోగుల
నుంచి రూ.3 కోట్లు వసూలు చేశాడు. నిరుద్యోగుల ఫిర్యాదుపై మందమర్రి పోలీసులు
కేసు నమోదు చేసి వెంకటయ్యను అరెస్టు చేశారు.
లా పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ
ఓయూ లా విభాగం అందిస్తున్న
పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని
అధికారులు తెలిపారు. సైబర్ లా, టాక్సేషన్ అండ్ ఇన్సూరెన్స్ లా,
ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ విభాగాలో కోర్సులను అందిస్తున్నామని
పేర్కొన్నారు. సెప్టెంబర్ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రవేశ పరీక్ష 20న నిర్వహిస్తున్నామని చెప్పారు.
Subscribe to:
Posts (Atom)