తెలంగాణ వెబ్ న్యూస్;బీహార్ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.బీహార్ ముఖ్యమంత్రి పదవికి జితన్ రాం మాంజీ రాజీనామా చేశారు. అసెంబ్లీలో బలపరీక్షకు ముందేపదవి నుంచి తప్పుకున్న మాంజీ శుక్రవారం గవర్నర్ త్రిపాఠీని కలిసి రాజీనామా పత్రాలను అందజేశారు.మాంజీ రాజీనామాతో నితీష్ కుమార్ సీఎం అవడానికి మార్గం సుగమైంది.ఆయన రాజీనామాతో జేడీయూ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. బీహార్ కు కాబోయే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మాంజీ ముందేరాజీనామా చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు బీజేపీ
ప్రోద్బలంతోనే మాంజీ కొనసాగారని ఆరోపించారు.మాంజీ వెనుక ఉండి బీహార్ లో ప్రజాస్వామ్యం కూనీ చేయాలని బీజేపీ చేసిందని నితీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment