All meadia

 

Saturday, 7 February 2015

నేడు నవోదయ ప్రవేశ పరీక్షలు

తెలంగాణ వెబ్ న్యూస్;నవోదయ విద్యాలయాలలో 6వ తరగతిలో ప్రవేశాల కోసం శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.జిల్లా వ్యాప్తంగా 36 కేంద్రాలలో10,259 మంది విద్యార్థులు పరీక్షరాయనున్నారు.
నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాల కోసం శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలను  ఏర్పాటు చేశారు.వీటి పరిధిలో 10,259 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.వీరంతా ప్రభుత్వ,ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో అయిదో తరగతి వరకు చదివిన విద్యార్థులే.పరీక్షఉదయం 11;30 గంటల నుంచి  మధ్యాహ్నం 1;30 గంటల వరకు జరుగుతుంది.

No comments:

Post a Comment