All meadia

 

Friday, 27 February 2015

ఎంసెట్ కు డీఎస్సీ పరీక్షల ఇక్కట్లు

తెలంగాణ వెబ్ న్యూస్;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ నిర్వహణకు డీఎస్సీ,కర్ణాటక పరీక్షలు ఆటంకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.అదేవిధంగా డీఎస్సీకి కూడా ఎంసెట్ పరీక్షల వల్ల ఇబ్బందులు తలెత్తే పరిస్తితి ఏర్పడింది..రాష్ట్రంలో ఎంసెట్ ,డీఎస్సీ రాత పరీక్షలను ఒకే సమయంలో నిర్వహిస్తుండటమే దీనికి కారణం.దీంతో ఆయా పరీక్షలకు నిర్వహణ పరంగా సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఏపీలో మే 10న నిర్వహించనున్న ఎంసెట్ కు 2 లక్షల మంది హాజరవుతామని అంచనా.ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా 400 పరీక్షా కేంద్రాల అవసరం ఉంది. ఇక భాషా పండితులు,వ్యాయామ ఉపాధ్యాయ రాత పరీక్షలకోసం 65 వేల మంది దరఖాస్తు  చేశారు. ఈ పరీక్షలు మే 10న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. ఇదే సమయంలో ఎంసెట్ మెడికల్ పరీక్ష కూడా జరగనుంది 

No comments:

Post a Comment