All meadia

 

Sunday, 24 February 2019

49 మంది సిఆర్పీఎఫ్ వీర జవ్వాన్లకు" అంకితo : goutham


వైకుంఠ మహాప్రస్థానం, షేక్ పేట్, హైదరాబాద్..ఫిబ్రవరి
"అనాధ దేహాలకు ఉచిత అంత్యక్రియలు" అనే ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటికే 500 ల మంది అనాధ దేహాలకు ఉచితంగా అంత్యక్రియలు చేయటమే కాకుండా, నేడు షేక్ పేట్ లోని వైకుంఠ మహాప్రస్థానం స్మశానం లో 150 మంది అనాధలకు ఒకేసారి సంప్రదాయ పద్ధతిలో రెండు గంటలలో పిండప్రదానం చేసి తనదైన శైలి లో మానవత్వాన్ని మించి జనాల కోసం, దేశం కోసం ఏదో అతీతంగా చేయాలనే గొప్ప ఆలోచనతో ఈ మహత్కార్యాన్ని ప్రయత్నించి "వండర్ బుక్ అఫ్ వరల్డ్ రెకార్డ్" లో స్థానం పొందాడు సికింద్రాబాద్ కార్కానా కి చెందిన సర్వ్ నీడి స్వచ్చంధ సంస్థ నిర్వాహకులు గౌతమ్ కుమార్.
 "తాను బ్రతికున్నంతవరకు ఏ మనిషి అనాధ కాదు, చనిపోయిన తర్వాత కూడా ఆ ఆత్మ కి నేను అనాధాని అనే బాధ ని మిగిల్చటం తనకు ఏ మాత్రం తృప్త్తి ని ఇవ్వదు" అని  అంటున్నారు గౌతమ్. 

"ఎవరి కోసం వారు రికార్డు లు బద్దలు కొట్టుకోవటం మాములే కానీ మనతో పాటు నివసించే జనాల కోసం, దేశం కోసం ఒక రికార్డు ని సాధించటం లో నాకు అంతు తెలియని ఆనందం ఉంది, నా ఈ రికార్డు " పుల్వామా దాడి లోఅసువులు బాసిన 49 మంది సిఆర్పీఎఫ్ వీర జవ్వాన్లకు" అంకితమిస్తున్నాను" అని అంటున్నారు గౌతమ్..

నగరం లో అతి దీన స్థితుల్లో ఉన్న తల్లి తండ్రులు ఎవరైనా ఉంటే, నా అనేవాళ్ళు ఉండి కూడా పట్టించుకోని వాళ్ళెవరైనా ఉంటే శామీర్పేట్ తూముకుంట లో తన సర్వ్ నీడి వృద్ధాశ్రమానికి రావచ్చని, వాళ్ళ కోసం ఏ కొడుకు ఎల్లప్పుడూ బాధ్యతలు తీసుకోవటానికి సిద్ధంగా ఉంటానని, అలాగే ఎవరైనా అనాధలుగా మరణించారని  సమాచారమందిస్తే తాను ఓ రక్త సంబంధికుడిలా అన్ని భాద్యతలు తీసుకుని అంత్యక్రియలు జరిపి, పిండప్రదానాలు కూడా చేయటానికి అన్ని వేళలా సిద్ధం అంటున్నారు గౌతమ్.