All meadia

 

Thursday, 5 February 2015

పట్టపగలే రూ.61 లక్షల బంగారు ఆభరణాల దోపిడీ

తెలంగాణ వెబ్ న్యూస్;మెదక్ జిల్లా రామచంద్రాపురం లోని ముత్తూట్ మినీ గోల్డ్ లోన్ సంస్థలో బుధవారం దోపీడీ జరిగింది.ముంబయి జాతీయ రహదారి పక్కన ,బీరంగూడ కూడలి సమీపాన పట్టపగలే చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.బుధవారం కార్యాలయం తెరిచిన కొద్ది సేపట్టికి ఐదుగురు దుండగలు అక్కడికి చేరుకున్నారు. వారిలో ఇద్దరు బయట కాపలా ఉండగా...ముగ్గురు లోపలికి ప్రవేశించి మేనేజర్ శంకర్ రావు.సహాయ మేనేజర్ కృష్ణంరాజులను కత్తులతో బెదిరించి చేతులను కట్టేశారు.ఈ సమయంలో కార్యాలయాన్ని వూడ్చేందుకు వచ్చిన హైమావతి అనే యువతిని బెదిరించి ఓ మూలన కూర్చోబెట్టారుఅనంతరం లాకర్ల తాళాలు తెరిచి రూ.61 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు,రూ.87 వేల నగదు చేజిక్కించుకుని ఉద్యోగులిద్దర్నీ లాకరు గదిలో వేసి తాళం వేశారు.

No comments:

Post a Comment