All meadia

 

Wednesday, 11 March 2015

ఇళ్లు లేవు....రావు,గాల్లోకి వదిలేశారు,

తెలంగాణ వెబ్ న్యూస్;తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని బీజూపీ ఎమ్మెల్యే ఎన్ వీఎప్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు.బుధవారం అసెంబ్లీ వాయిదా అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో డబుల్ బెడ్ రూమ్ ఇఠ్లు ఇస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకివచ్చిన టీఆర్ఎస్....ఇప్పుడు ఆ విషయాన్ని  మరిచిపోయందన్నారు.ఇళ్లు లేవు...ఇళ్లు రావనేదే టీఆర్ ఎస్ సర్కార్ విధానమని ఎన్ వీఎన్ ఎన్ ప్రభాకర్ ధ్వజమెత్తారు.ఇక విద్యారంగాని వస్తే కేజీ నుంచి పీజీ వరకూ మేథోమధనం తర్వాత చూద్దామంటూ విద్యను గాలికి వదిలి లేశారని ఆయన మండిపడ్డారు.హామీలను ఎన్నికల ప్రచారానికి  మాత్రమే టీఆర్ ఎస్ వాడుకుందన్నారు.అలాగే సాగునీటి విషయానికి వస్తే ప్రతి నియోజకవర్గంలోనూ భూమిని సాగులోకి తెస్తామని ఆవిషయాన్నే ప్రభుత్వం మరచిందన్నారు.అలాగే ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన కల్యాణ లక్ష్మికి,షాదీ ముబారక్ లకు ఎంత ఖర్చుచేశారో చెప్పలేనివిధంగా సర్కార్ ఉందన్నారు.

No comments:

Post a Comment