All meadia

 

Wednesday, 4 March 2015

మిగులు రాష్ట్రం లోటులో

తెలంగాణ వెబ్ న్యూస్;అమ్మ పెట్టదు..అడుక్కు తినానివ్వదు..అన్నట్లు తయారైంది రాష్ట్రాల్లో పసికూన తెలంగాణ పరిస్థితి.ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోతే బోలెడంత మిగులు బడ్జెట్ ఉంటుందన్న వాదనలతో కేంద్రం నుంచి వచ్చేే సాయమూ రాకుండా పోయింది. మిగులు బడ్జెట్ గురించి విభజనకు ముందు జరిగిన ప్రచారం ...తెలంగాణ కొంప ముంచింది. నిజంగానే మిగులు ఉంటుందన్న అంచనాలతో ప్రవేశ పెట్టిన రూ.లక్షకోట్ల బడ్జెట్ ప్రభుత్వానికి తలకు మించిన భారమై కూర్చుంది. సాయం చేసి భారాన్ని పంచుకోండి..అని కేంద్రాన్ని  అడిగితే..మిగులు రాష్ట్రం మీకు సాయమేందుకు?అంటూ  సమాధానం వచ్చింది.పోనీ అప్పు తెచ్చుకుంటాం..ఎఫ్ఆర్ బీఎం చట్టం నుంచి మినహాయింపు ఇవ్వండి..అంటే మిగులు రాష్ట్రానికి అప్పు ఎందుకు. అని ఎదురు ప్రశ్నబులెట్ లా దూసుకొచ్చింది.దీంతో మింగాలేక,కక్కాలేక..అన్నట్లు రూ.46,000కోట్ల ప్రణాళిక పద్దులో కేవలంరూ.20,000కోట్లే ఖర్చు చేసిన ప్రభుత్వం,మార్చి 31 లోపు మిగాలిన రూ.26,000 కోట్ల ఖర్చుకు నిధులను వెతుక్కుంటోంది. పైగా పుండు మీద కారం రాసినట్లు..పోొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి ఏదో ఒక రూపేణా రూ.2,000 కోట్లు సాయం అందింది. 

No comments:

Post a Comment