All meadia

 

Wednesday, 25 March 2015

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించాలనుకుంటున్న సెక్రటేరియట్ కోసం ఐదుగురు సీనియర్ ఐఎఎస్ అధికారులతో కమీటీ వేసింది. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం, నమూనాలు, అందుకు అయ్యే ఖర్చు పూర్తి వివరాలను ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిస్తుంది. ఎర్రగడ్డ ప్రాంతంలో ప్రభుత్వం నిర్మించనున్న కొత్త సేక్రటేరియట్ కు రూ.150 కోట్లను కూడా మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్పత్రి ప్రాంతంలో నిర్మించనున్న సచివాలయంలో కోసం ఐదుగురు అధికారులతో కమిటీ వేశారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్ గా ఐదుగురు ఐఎఎస్ అధికారులను ఇందులో నియమించారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, రోడ్డు భవనాల శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. వీరు కొత్త సచివాలయ నిర్మాణం కోసం అవసరమయ్యే నమూనాలు, ఖర్చు భవనాలు, కార్యలయాల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తాను. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

.

No comments:

Post a Comment