All meadia

 

Sunday, 8 March 2015

మీర్ పేట టీకేఆర్ కాలేజీ వద్ద ఉద్రికత్త

తెలంగాణ వెబ్ న్యూస్;జూనియర్ సివిల్ జడ్జి పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులనుతెలంగాణ  న్యాయవాదులుు అడ్డుకోవడంతో మీర్ పేట టీకేఆర్ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఉదయం పది గంటలకు ప్రారంభమైన పరీక్షను రాసేందుకు అభ్యర్థులు భారీ సంఖ్యలో వచ్చారు.వీరిని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నేతలు అడ్డుకున్నారు
ఈ క్రమంలో అభ్యర్థులకు న్యాయవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.గత కొన్ని రోజులుగా తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ న్యాయవాదులు..హైకోర్టు ఏర్పాటు చేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సివిల్ జడ్జి పరీక్షలు నిర్వహిస్తున్న టీకేఆర్ కాలేజీ వద్దకు చురుకున్న జేఏసీ నేతలు పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులను అడ్డుకున్నారు.దీంతో అక్కడ తీవ్రఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులుు ఆందోళనకారులను అరెస్ట్ చేసి మీర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.

No comments:

Post a Comment