All meadia

 

Tuesday, 3 March 2015

ప్రగతి హనుమంతరావు కన్ను మూత

తెలంగాణ వెబ్ న్యూస్;అత్యాధునిక ముద్రణ రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రగతి ఆర్ట్ ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంతకరావు (91) మృతి చెందారు.కొద్దికాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన సోమవారం మధ్యాహ్నం తన స్వగృహంలోనే తుది శ్వాష  విడిచారు.రైతు బిడ్డగా పుట్టి, విద్యార్థి నాయకుడిగా ఎదిగి,కమ్యూనిస్టుగా చెరసాల జీవితం గడిపిన హనుమంతరావు తెలుగు సినీ,సాంస్కృతిక రంగాలకూ తన సేవలు అందించారు.ఎన్నో ముద్రణ సంస్థలకు సాధ్యం కాని గోల్డెన్ ఎలిఫెంట్ అవార్డును 2010 లో దక్కించుకొన్నారు.ఆయనకు భార్య సీతాలక్ష్మమ్మ,ఇద్దరు కుమారులు నరేంద్ర,మహేంద్ర ఉన్నారు. 

No comments:

Post a Comment