All meadia

 

Thursday, 12 March 2015

సర్పంచ్లు, జడ్పీటీసీలు, యంపిటీసీలు, యంపిపిలు, జిల్లాపరిషత్ చైర్మన్లతో పంచాయితీరాజ్ శాక మంత్రి కె.తారక రామారావు సమావేశం పంచాయితీరాజ్ శాక మంత్రి కె.తారక రామారావు స్థానిక సంస్ధల ప్రజాప్రతినిదులతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు. సర్పంచ్లు, జడ్పీటీసీలు, యంపిటీసీలు, యంపిపిలు, జిల్లాపరిషత్ చైర్మన్లు హజరయిన ఈ సమావేశంలో పలు కీలక మైన అంశాలపై మంత్రి వారితొ చర్చించారు. క్షేత్రస్థాయిలో వారు ఏదుర్కోటున్న సమస్యలను సానూకూలంగా పరిష్కరిస్తామని అయన వారికి హమీ ఇచ్చారు. స్థానిక సంస్ధల ప్రతినిధులను కలవడం సంతోషంగా ఉందన్నమంత్రి , ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లెందుకు చిత్తశుధ్దితో పనిచేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం పంచాయితీరాజ్ శాఖ బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇంచ్చిందని గుర్తుచేసిన మంత్రి, గ్రామాల అభివృద్దికి స్థానిక సంస్ధల ప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన అవసరముందన్నారు.స్థానిక సంస్ధల బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి ఈధిశగా ఓక నూతన ఓరవడిని నెలకోల్పేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి వ్యవస్ధలను అధ్యయనం చేశామన్నారు.

.

No comments:

Post a Comment