తెలంగాణ వెబ్ న్యూస్;ఫీజు రీయింబర్స్ మెంట్ పై నెలకొన్న ప్రతిష్ఠంభనతో విద్యార్థుల్లోఆందోళన నెలకొంది.తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో సంబంధింత కళాశాలలు చెల్లిస్తేనే పరీక్ష హాల్ టికెట్లు ఇస్తామని తేల్చి చెబుతున్నాయి.2014-15 సంవత్సరానికి ప్రభుత్వం ఫీజురీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ దరఖాస్తులకు ఈ పాస్ ప్రకటన జారీచేయకపోవడం వల్లే ఈ పరిస్థిితి నెలకొంది.మరో వారంరోజుల్లో రాష్ట్రంలోని యూనివర్సిటీ పరిధిలో వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఓయూ పరిధిలో మార్చి 26 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా,శాతావాహన పరిధిలో మార్చి 11 నుంచి,కేయూ పరిధిలో 18 నుంచి,పీయూ పరిధిలో 24 నుంచి,ఏం.జీయూ పరిధిలో మార్చి 19నుంచి ప్రారంభం కానున్నాయి.దీంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఏ విద్యార్థి కి ఫీజురీయింబర్స్ మెంట్ వస్తుందో.,,ఎవరిక రాదో;అన్న పరిస్థితి నెలకొంది.ఏప్రిల్ రెండోవారంతో పరీక్షలు ముగియనున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజురీయింబర్స్ మెంట్ కు సంబంధించి కళాశాలలకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో యాజమాన్యాల్లో నూ ఆందోళన నెలకొంది.పరీక్షలు ముగి శాక విద్యార్తుల నుంచి ఫీజులు వసూలు చేయడం కష్టమనే ఉద్దేశంతో పరీక్షలకు ముందుగానే విద్యార్థుల నుంచి ఫీజు వసూలకు సిద్ధమవుతున్నాయి.
No comments:
Post a Comment