All meadia

 

Monday, 2 March 2015

డీఎడ్ విద్యార్థుల భవిషత్త్యు అగమ్యగోచరం

తెలంగాణ వెబ్ న్యూస్;ఆంధ్రప్రదేశ్ లో 2013-15 బ్యాచ్ డీఎడ్ ప్రథమ సంవత్సరం థియరీ పరీక్షలు నిర్వహించకపోవడంతో దాదాపు 23,500మంది విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. కోర్సులో చేరి దాదాపు 15 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు పరీక్షల ఏసే లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆవేదర వ్యక్తం చేస్తున్నారు. కేవలం 850 మంది విద్యార్థులకు కాలేజల యాజమాన్యాలు స్పాట్ లో అడ్మిషన్లు నిర్వహించుకోవడమే పరీక్షల అసాధారణ జాప్యానికి కారణమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అడ్మిషన్ నిబంథనలకు విరుద్దంగా కొన్ని కాలేజీల యాజమాన్యాలు స్పాట్ పేరిట ప్రవేశాలు కల్పించాయి. ఈవ్యవహారం న్యాయస్తానానికి వెళ్లింది.ఇంకేముంది ఫస్టియర్ పరీక్షలను నిలిపివేశారు.కేవలం 850 మంది విద్యార్థుల అడంమిషన్ విషయంలో ఏర్పడిన వివాదాన్ని సాకుగా చూపుతూ డీఎడ్ ఫస్టియర్ కాలవ్యవధి పూర్తయినప్పటీకీ పరీక్షలు నిర్వహించకుండా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు. వాస్తవానికి 2013-15 బ్యాచ్ డీఎడ్ నోటిఫికేషన్ సమైక్య రాష్ట్రంలో విడుదల చేశారు. ఆతర్వాత ఈ బ్యాచ్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి,ఫలితాలు విడుదల చేసింది.కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వరకు పరీక్షల ఊసే లేదు.

No comments:

Post a Comment