All meadia

 

Tuesday, 17 March 2015

పరీక్షలంటే పదొక్కటేనా?

తెలంగాణ వెబ్ న్యూస్;వార్షిక పరీక్షలంటే అస్సలు లెక్క చేయకుండా....రాసినా రాయకున్నా పాసై పోతారన్నట్లు  తేలిగ్గా తీసుకుంటే ఆ స్కూల్ నేమనాలి? ప్రభుత్వ పాఠశాల అనాలి ఇక్కడ వార్షిక పరీక్షలు,మూల్యాంకన ఏటా ఓ మొక్కుబడి తంతుగా తయారవుతున్నాయి.పదో తరగతి తప్పిస్తే...మిగిలిన 9 తరగతుల వార్షిక పరీక్షలన్నీ తూతూమంత్రంగా మారాయని విద్యాశాఖే అంగీకరిస్తోంది.పరీక్షలు తంతుగా నిర్వహించి.ఫలితాలు ప్రకటించేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు.1-9 తరగతుల పరీక్షల సమయంలోనే పదో తరగతి పరీక్షపేపర్ల మూల్యాంకనానికి ఉపాధ్యాయులంతా వెళ్లి పోతున్నారు.దీంతో హైస్కూళ్లలో పీఈటీలు తప్పిస్తే మిగిలిన వారెవరూ ఉండటం లేదు.గత కొన్ని సంవత్సరాలుగా నేనే అన్ని తరగతుల పరీక్షలు నిర్వహిస్తున్నాను.ఎందుకీ చదువులని బాధేస్తుంది.కొత్త రాష్ట్రాల్లోనైతే ఈ పద్దతేమైనా మారుస్తారేమో చూడాలి అని ఆదిలాబాద్ జిల్లాలో పనిచేసే వ్యాయామోపాధ్యాయుడొకరు ఈనాడు వాసోయారు.హైదరాబాద్ లో శిక్షణ శిబిరాల సమయంలో ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి ఉపాధ్యాయులు తీసుకొచ్చినట్లు సమాచారం.ఈ జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని... ఈసారి పాఠశాలలకు సెలవుల్ని తొందరగా  ఇవ్వాలనే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉన్న నేపథ్యంలో...మరి ఈసారి తెలంగాణలో 1-9 తరగతుల పరీక్షల తేదీల్ని ఏమైనా మారుస్తారా అనేది ఆసక్తికరాంశం.

No comments:

Post a Comment