తెలంగాణ వెబ్ న్యూస్;కేసీఆర్ కుటుంబం గుప్పిట్లో తెలంగాణ నగిలి పోతోందని,తుగ్లక్ పాలనతో ప్రజలు నరకయాతన పడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్ష,కార్యనిర్వాహక అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,భట్టి విక్రమార్కలు ధ్వజమెత్తారు.కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు తాము భయపడేది లేదని,,,కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెరాస పై కలిసికట్టుగా పోరాడుతామని స్పష్టం చేవారు.పార్టీకి కొత్త రక్తం తెస్తామని,మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ...తాను ఇరవై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని,కేసీఆర్ లాంటి అనైతిక ముఖ్యమంత్రి ని చూడలేదన్నారు.నిస్సిగ్గుగా విపక్షపార్టీల ఎమ్మెల్యేలను, నేతలను ప్రలోభ పెట్టి వారిని పార్టీలో చుర్చుకుంటున్నారని విమర్శించారు.
No comments:
Post a Comment