తెలంగాణ వెబ్ న్యూస్;తెలంగాణ అసెంబ్లీ నుంచి తమ సస్పెన్షన్ కు నిరసనగా టీటీడీపీ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద నిరసన దీక్షకు దిగారు.టి అసెంబ్లీలో సస్పెన్షన్ కు గురైన పది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయం నుంచి ర్యాలీగా గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు.సాయంత్రం 4 గంటల వరకు ధర్నా చేయనున్నారు.రేపటి(బుదవారం)నుంచి జిల్లాల్లో బస్సుయాత్ర చేపట్టాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారు.మహబూబ్ నగర్ జిల్లా నుంచి బస్సు యాత్ర ప్రారంభంకానుంది.కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను, నియంతృత్వ పోకడలను ప్రజలకు వివరించాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
No comments:
Post a Comment