తెలంగాణ వెబ్ న్యూస్;యూపీఏ పథకాలనే మళ్లీ కూర్చి ప్రవేశ పెడుతోందన్న కాంగ్రెస్ విమర్శలను మోదీ తోసిపుచ్చారు.తన ప్రభుత్వం కార్పొరేట్ అనుకూలమని విపక్షం చేసిన ఆరోపణలనూ తిప్పికొట్టారు.రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు మంగళవారం ఆయన రాజ్యసభలో సమాధానమిస్తూ వివిధ అంశాలపై విపులంగా మాట్లాడారు. గంటపాటు ఆయన ప్రసంగం సాగింది.కాంగ్రెస్ ఆరోపణలకు బదులిస్తూ వాజ్ పేయి హయాంలో తీసుకొచ్చిన పథకాలనే యూపీఏ అనుకరించిందని విమర్శించారు.
No comments:
Post a Comment