తెలంగాణ వెబ్ న్యూస్;ప్రతీ ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి తీరుతామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేవారు.బుధవారం ఏపీ అసెంబ్లీలో మాట్లాడుతూ వైఎస్ నార్వాకంతో నిరుద్యోగులు పెరిగిపోయారని ఆరోపించారు.ఫీ రీయింబర్స్ మెంట్ తో విద్యా వ్యవస్థను వైఎస్ భ్రష్టు పట్టించారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తున్న జగన్ సాక్షిలో 216 మందిఉద్యోగులను ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రత్యేకంగా స్కిల్ డెవలప్ మెంట్ అనే వ్యస్థను ఏర్పాటు చేసి నైపుణ్యాభివృద్ధితో ప్రతీ ఒక్కరికి ఉద్యోగం ఇస్తామని మంత్రి తెలిపారు.
అంతకు ముందు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం మీద చర్చసందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలతొసభలో గందరగోళం నెలకొంది.బాబు వచ్చాడు..జాబు ఊడిందన్న జగన్ వ్యాఖ్యానించడంపై అధికారపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు.టీడీపీ హాయంలో నిరుద్యోగులు పెరిగిపోతున్నారని జగన్ ఆరోపించారు.దీంతో జగన్ వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడుఎదురుదాడికి దిగారు.
No comments:
Post a Comment