తెలంగాణ వెబ్ న్యూస్;కనీస వేతనాల కోసం అంగన్ వాడీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళనను అడ్డుకోవడాన్ని సీపీఐ జాతీయ వర్గ కార్యవర్గ సభ్యుడుకె.నారాయణ తప్పుపట్టారు.తెలంగాణతో పాటు గోవా,మహారాష్ట్ర ప్రభుత్వాలు అంగన్ వాడీల వేతనాలు పెంచినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నారాయణ ఆరోపించారు. అనేక పథకాల అమలు కోసం అంగన్ వాడీల సేవలు వినియోగించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి కనీస హక్కులు కల్పించే విషయాన్ని విస్మరిస్తోందన్నారు.సమాజానికి,ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తున్న అంగన్ వాడీ కార్యకర్తలపై బలప్రయోగం చేసి అణచి వేసేందుకు ప్రయత్నిస్తే తెదేపా ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతుందన్నారు.ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించుకుని వారికి కార్మిక హక్కులు వర్తించేలా,కనీస వేతనాలు అందేలా చూడాలని నారాయణ కోరారు.
No comments:
Post a Comment