*9దాటితే అనుమతించరు
*9 నుంచి ఇంటర్ పరీక్షలు
తెలంగాణ వెబ్ న్యూస్; తెలంగాణ రాష్ట్రంలో తొలి ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు రంగం సిద్ధమైంది.మార్చి 9 నుంచి ఇంటర్మీయెట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఆరంభమవుతున్నాయి.10 నుంచి రెండో సంవత్సరం పరీక్షలుంటాయి.ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షజరుగుతుంది.సమయానికి అరగంట ముందే (8.30) కు విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకుని.....15 నిమిషాల ముందే (8.45) కు సీట్లో కూర్చోవాలని తెలంగాణ ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.ఉదయం 9 గంటల తర్వాత అనుమతించబోమని తెలిపారు.మార్చి 27 వరకు పరీక్షలు సాగుతాయి.అయితే ప్రధానపరీక్షలు 23 కు పూర్తవుతాయి.రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1251 పరీక్ష కేంద్రాలను (ప్రభుత్వ కళాశాలలు 502;ప్రైవేటు-749) ఏర్పాటు చేశారు.
No comments:
Post a Comment