తెలంగాణ వెబ్ న్యూస్;దంపతులిద్దరూ రాష్ట్ర స్థాయి పోస్టులో పనిచేస్తున్న స్థానికేతరులైతే వారు తమ సొంత రాష్ట్రానికి వెళ్లక తప్పదు.ఇద్దరూ ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రంలోనే ఉంటామని ఐచ్ఛికాన్ని ఇచ్చినా ఫలితం ఉండదు.ఎస్సీ,ఎస్టీల్లోని ఉప కులాలను ఏరాష్ట్రం ప్రకటిస్తే ఆ రాష్ట్రానికే ఆయా ఉద్యోగులు నియమితులవుతారు.పక్క రాష్ట్రాంలో ఉంటామంటూ వారు ఐచ్ఛికాన్ని ఇచ్చినా పరిగణలోకి తీసుకోరు.ఉద్యోగులు తాము స్థానికులైన రాష్ట్రాన్ని కోరుకొన్నప్పుడు అక్కడిమంజూరీ పోస్టుల్లోపూర్తిగా వారినే నియమిస్తారు.ఒంటరి పోస్టులో పనిచేస్తున్న ఉద్యోగి స్థానికత ఆధారంగా ఆయా పోస్టులను విభజిస్తారు.ఉద్యోగులు లేకుండా ఖాళీగా ఉన్న పోస్టులన్నీ ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వడం లేదా ఉభయ హెచ్ వోడీల పరస్పర అంగీకారం మేరకు ఏదో ఒక రాష్ట్రానికి కేటాయించడం చేస్తారు.
No comments:
Post a Comment