తెలంగాణ వెబ్ న్యూస్;తెలంగాణ ప్రభుత్వం అఖిలభారత సర్వీసు (ఏఐఎస్)ల ఎంపికపై దృష్టి సారించింది.యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా నిర్వహించే సివిల్,ఐఎఫ్ఎస్ ఇతర సర్వీసులకు ఎంపికయ్యేలా కార్యాచరణ రైపొందించాలని నిర్ణయించింది.ఇందు కోసం వారికి అత్యుత్తమ శిక్షణ సౌకర్యాలను,ఇతర వనరులను కల్పింనుంది.సంక్షేమ శాఖల ద్వారా ఈ ప్రణాళికను వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్) నుంచి అమలు చేయనుంది.ఇటీవల ప్రభుత్వం సంక్షేమ శాఖల సమీక్షల సందర్భంగా అఖిలభారత సర్వీసుల ఎంపిక ప్రక్రియను పరిశీలించింది.బిహార్,ఒడిశాయూపీ,తమిళనాడు తదితర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నుంచి అతి తక్కువ మంది అఖిల భారత సర్వీసులకు ఎంపికవుతున్నారని గుర్తించింది.
No comments:
Post a Comment